కొత్త సినిమాకి కొత్త సీన్స్ కలుపుతున్నారు..!
Tuesday, August 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్త సినిమాకి కొత్త సీన్స్ కలుపుతున్నారు...ఇంతకీ ఆ కొత్త సినిమా ఏమిటి అనుకుంటున్నారా..? అల్లు శిరీష్ - లావణ్య జంటగా నటించిన శ్రీరస్తు శుభమస్తు. పరుశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదిలా ఉంటే...ఈ చిత్రంలో కొత్త సీన్స్ కలుపుతున్నారట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ...ఆలీ గారు కామెడీ & నేను చేసిన రొమాంటిక్ సీన్స్ ని ఆడియోన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే...ఎడిటింగ్ లో తీసేసిన కొన్ని సీన్స్ ను ఇప్పుడు కలుపుతున్నాం. ఈ సీన్స్ కి డబ్బింగ్ కూడా పూర్తయ్యింది. ఈ సీన్స్ నాకు లావణ్యకు బాగా ఇష్టం. ఆడియోన్స్ కి కూడా ఈ సీన్స్ నచ్చుతాయి అని ఆశిస్తున్నాను. గురువారం నుంచి కొత్త సీన్స్ థియేటర్లో చూడచ్చు అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments