Siddham in Addanki: మేదరమెట్లలో పోలికేకకు వైసీపీ 'సిద్ధం'.. ప్రజలందరి చూపు అటు వైపే..
Send us your feedback to audioarticles@vaarta.com
మరో పోలికేకకు వైసీపీ సిద్ధమైంది. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సిద్ధం సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో ముందుంది. ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో మరో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 6 జిల్లాల్లోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్‌ను ఈ సభ ద్వారా సీఎం జగన్ ఎన్నికల కురుక్షేత్రానికి సన్నద్ధం చేయనున్నారు. దాదాపు 15 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యే ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది.
భీమిలీ, దెందులూరు, రాప్తాడులలో జరిగిన సిద్ధం సభలు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మును, ప్రజాదరణను తెలియజేశాయి. ఇప్పుడు ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే విధంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. సభా స్థలంలో సీఎం జగన్ ప్రసంగం ప్రతి ఒక్కరికీ కనిపించేలా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక జగన్ కార్యకర్తలకు చేరువగా వెళ్లి మాట్లాడి వచ్చేందుకు వీలుగా భారీ ర్యాంప్‌ను కూడా సిద్ధం చేశారు. సభ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, అధికారులు, నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇటు వరుసగా సిద్ధం సభలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుండగా.. అటు ప్రత్యర్ధి టీడీపీ, జనసేన కూటమి ఇలాంటి సభ ఒక్కటి కూడా నిర్వహించలేకపోవడం వారి అనైక్యతను, ప్రజల్లో వారికున్న బలాన్ని తేటతెల్లం చేస్తోంది. ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తూ వరుస సభలతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ కూటమి పొత్తులు, బేరసారాల పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. మేదరమెట్ల సిద్ధం సభ తర్వాత ప్రజల్లో వైసీపీకి ఉన్న ఆదరణ మరోమారు రుజువుకానుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇదే సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫేస్టోలో కొన్ని అంశాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సభ తర్వాత ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారవుతుందని విమర్శిస్తున్నారు. ఇప్పటికే మళ్లీ జగనే సీఎం అవుతారనే ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ ఎన్ని పార్టీలు కలిసినా జగన్‌ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదని చెబుతున్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధితో అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకున్న జగన్ ప్రభుత్వాన్ని నిలువరించడం కష్టమని టీడీపీ, జనసేన క్యాడర్ అభిప్రాయపడుతోంది. మొత్తానికి మరోసారి రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం ఖాయమని అంచనా వేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments