జూన్ 3న 'అడవిలో లాస్ట్ బస్' విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ కి ప్రేక్షకాదరణ మెండుగా ఉంటుంది. అయితే, కాన్సెప్ట్, స్ర్కీన్ ప్లే బ్రహ్మాండంగా కుదరాలి. అలా కుదిరిన కన్నడ చిత్రం 'లాస్ట్ బస్'. ఈ చిత్రాన్ని `అడవిలో లాస్ట్ బస్` పేరుతో శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులోకి విడుదల చేయనుంది. పూజా సమర్పణలో జూన్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది. ఎస్.డి. అరవింద్ దర్శకత్వం వహించడంతో పాటు పాటలు కూడా స్వరపరిచారు. అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్, మానస జోషి, రాజేశ్ కీలక పాత్రల్లో నటించారు.
చిత్ర విశేషాల గురించి సమర్పకురాలు పూజశ్రీ మాట్లాడుతూ ``అద్భుతమైన కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా ఉంటుంది. మంచి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. కన్నడంలో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై, ఘన విజయం సాధించింది. మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు కర్ణాటక ప్రభుత్వం నుంచి రెండు అవార్డులు కూడా వరించడం విశేషం. లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ఇందులో రెండు పాటలున్నాయి. తొలిసారి బీబీసీలో ఈ సినిమా పాట ప్రదర్శితమైంది. రెండు పాటలను తెలుగులో రాకేందుమౌళి వెన్నెలకంటి రాశారు. నందు తుర్లపాటి రాసిన సంభాషణలు హైలైట్ అవుతాయి. డబ్బింగ్‌తో పాటు అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది`` అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com