‘సిగురాకు సిట్టడివి గడ్డ  చిచ్చుల్లో అట్టుడికి పోరాదు  బిడ్డా‘ భీమ్లా నాయక్' కోసం అడవి తల్లి గీతం

  • IndiaGlitz, [Saturday,December 04 2021]

'భీమ్లా నాయక్' నుంచి మరో పాట విడుదల
స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కు నివాళి
రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ఆవేదన భరితమైన గీతం
గుండెల్ని పిండేలా తమన్ స్వరాలు

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత 'త్రివిక్రమ్' అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.

‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి మరో గీతం నేడు విడుదల అయింది. పాట వివరాల్లోకి వెళితే.....
గీతం ప్రారంభంలో స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కు నివాళి గా ఆయన చిత్రం అందులో ‘మీ ఉచ్ఛ్వాసం కవనం...మీ నిశ్వాసం గానం...మీ జ్ఞాపకం అమరం‘ అన్న వాక్యాలు కనిపిస్తాయి. ఆ తరువాత గీతం ప్రారంభం అవుతుంది.

“కిందున్న మడుసులకా కోపాలు తెమలవు
పైనున్న సామేమో కిమ్మని పలకడు
దూకేటి కత్తులా కనికరమెరగవు
అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు”

‘భీమ్లా నాయక్‘ లో ఓ కీలక సందర్భంలో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. ఆవేదనా భరితంగా సాగిన తమన్ స్వరాలు ఓ వైపుగుండెల్ని పిండేస్తే, మరో వైపు దుర్గవ్వ, సాహితి చాగంటిల గళంలో హృదయం బరువెక్కుతుంది. రెండు నిమిషాల ముప్ఫై రెండు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. పవన్ కళ్యాణ్, రానా, నిత్యమీనన్, సంయుక్త మీనన్ లు కనిపిస్తుంటారు విడుదల అయిన ఈ గీతం లో.

గీతానికి సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రి మాటల్లో చెప్పాలంటే.... ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు తగువు లాడుకుంటుంటే చూడలేని కన్నతల్లి యొక్క మనోవేదన ఏమిటన్నది ఈ పాట సారాంశం. ఇక్కడ కన్నతల్లి ఎవరో కాదు. ‘అడవి తల్లి‘. ఇలాంటి ఒక భావన ఈ పాటలో కావాలని దర్శకులు చెప్పిన వెంటనే నేను, సంగీత దర్శకుడు తమన్ ఆలోచనలు సాగిస్తున్న దశలో, గుండెల్ని రంపపు కోతకు గురి చేస్తుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక శబ్దాన్ని వినిపించారు. దానికి అనుగుణంగా నేను పదాలు కూర్చాను. అలా మా మాటల మధ్యలోనే పాట సిద్ధ మయింది. ఆవెంటనే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, చిత్ర దర్శకుడు సాగర్, చినబాబు గార్లకు వినిపించటం, వారికి ఎంత గానో నచ్చటం, పాట రికార్డ్ అవ్వటం జరిగింది. దీనికి అచ్చంగా పల్లె తనం తొణికిస లాడే గొంతులు సరితూగాయి. నా అదృష్టం ఏమిటంటే ఈ పాట విడుదల అవకముందే, రాసిన వెంటనే మా గురువు గారు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గార్కి వినిపించటం జరిగింది. పాట విన్న వెంటనే ఈ పాట నేనే రాశానా అన్న భావన, ఈ పల్లె భాష నాకెలా తెలుసు అన్న ఆశ్చర్యం నీకు కలగలేదా..? అంత బాగా రాసావు అంటూ మెచ్చుకుని ఆయన ఆశీర్వదించడం ఒకటైతే, చిత్ర కథాను సారం ఓ కీలక సందర్భంలో, అందరినీ ఒక మంచి భావోద్వేగానికి లోనయ్యే లాంటి ఈ గీతం రచించే అవకాశం నాకు రావటం మరో అదృష్టం గా భావిస్తున్నాను.

‘భీమ్లా నాయక్‘ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

More News

Hardik Pandya gets a new tattoo dedicated to his 1-year-old son; Shares picture

28-year-old Indian all-rounder Hardik Pandya recently got a tattoo on his arm dedicated to his one-year-old son Agastya.

Breaking! Kamal Haasan gets discharged from the hospital after two weeks - Viral footage

The legendary film personality and Makkal Needhi Maiam leader Kamal Haasan was admitted to the hospital on 22nd November 2021 after testing positive for the COVID-19.

Shocking! Bigg Boss Julie files a case against boyfriend

The latest shocking news about Julies is that Big Boss celebrity Julie has lodged a complaint with the Anna Nagar All Women Police Station alleging that Manish cheated on her by claiming to be in love with her and marrying her. The police are currently investigating the case.

Do you how much does Ajith kumar charge per film?

According to reports, Ajith is being paid around 55 crores per film, which makes him one of the highest-paid South Indian actors. His upcoming film 'Valimai', is directed by H Vinoth who had previously worked with Ajith Kumar in Nerkonda Paarvai. Produced by Boney Kapoor, Valimai also stars Huma Qureshi, Kartikeya Gummakonda, Pearle Maaney and Yogi Babu in important roles.

Suriya opens up for the first time on portraying Justice Chandru in Jai Bhim

"It was a great experience working on the film," reveals Suriya. He further added how he got into the skin of his character of K Chandru, "I first met Chandru sir at an event, but at that time I didn't know I would be doing a film based on him."