జడ్జ్‌గా ఆదాశర్మ...
Send us your feedback to audioarticles@vaarta.com
హార్ట్ ఏటాక్ సినిమాలో నితిన్ సరసన నటించి మెప్పించిన ముద్దుగుమ్మ ఆదాశర్మ. ఈ అమ్మడుకు తెలుగులో ఎందుకనో అవకాశాలు మాత్రం తక్కువయ్యాయి. సినిమా అవకాశాలు లేకపోతేనేం, ఆదాశర్మకు బుల్లితెర ఆహ్వానం పలికిందట. ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా త్వరలోనే ఓ పెద్ద డ్యాన్స్ షోను ప్రారంభించనుంది. హిందీలో స్టార్ ప్లస్ టీవీలో వచ్చే నాచ్ బలియే తరహాలో ఈ డ్యాన్స్ షో ఉంటుంది.
దీనికి పవన్ కల్యాణ్ మాజీ భార్య, దర్శకురాలు రేణుదేశాయ్ ఇందులో ఓ జడ్జిగా ఉండబోతుందని తెలుస్తుంది. కాగా ఇప్పుడు ఆదాశర్మ కూడా మరో జడ్జిగా వ్యవహరించనుందని సమాచారం. ఆదాశర్మ క్లాసికల్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. అలాగే ఈ షోకు ఉదయభాను యాంకర్‌గా వ్యవహరించనుందని ఫిలింనగర్ వర్గాల సమాచారం.
ఈ నెల 24న స్టార్ మాలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ డ్యాన్స్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని టీవీ యాజమాన్యం యోచిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com