వర్మను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నటి..
Send us your feedback to audioarticles@vaarta.com
వివాదస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మను ఓ నటి పెళ్లి చేసుకోవాలనుకుందట. ఇంతకు వర్మను పెళ్లి చేసుకోవాలనుకున్న నటి ఎవరు? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది? అనే వివరాల్లోకి వెళితే.. వర్మను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నటి ఎవరో కాదు గాయత్రీ గుప్తా..ఈ పేరును మీటూ సమయంలో ఎక్కువగా విన్నాం. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఈమె చాలా విషయాలను తెలియజేశారు. శ్రీరెడ్డి చెప్పినట్లు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని అన్నారు. తాను శ్రీరెడ్డితో మాట్లాడినప్పుడు ఆమె సమాధానాలు విని ఈ రచ్చతో కలిగే ప్రయోజనాలేమీ లేవని అనుకన్నానన్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతిచోట ఉంటుందని, అయితే ఇద్దరి ఇష్టం మీదనే అది ఆధారపడి ఉంటుందని తెలిపారు.
మీటూ గురించి మాట్లాడటం వల్లనేత తనకు అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఐస్క్రీమ్ 2లో వర్మగారితో కలిసి పనిచేశాను. ఆయనతో సినిమా చేస్తుంటే మారథాన్లో ఉన్నట్లే ఉంటుందని, ఆయన చాలా మంచి వ్యక్తి అని అన్నారు గాయత్రి. వయసులో తనకంటే ఎక్కువ వయసున్నవాడు కాకుంటే తనను పెళ్లి చేసుకునేదాన్ని అని.. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉంటే జీవితం చాలనిపిస్తుంది. వర్మ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments