Vichitra: హీరో బాలకృష్ణపై నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహం నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన మాజీ నటి విచిత్ర బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2001లో బాలకృష్ణ ‘భలేవాడివి బాసూ’ చిత్రంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీ హీరోయిన్లుగా నటించగా విచిత్ర గిరిజన యువతి పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని వెల్లడించింది.
ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్7లో విచిత్ర కంటెస్టెంట్‌గా పాల్గొంది. నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్లో మీ జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు. దీంతో ఆమె సమాధానం ఇస్తూ "2001లో నేను ఓ తెలుగు సినిమాలో నటించాను. కానీ అదే నా చివరి సినిమా అయ్యింది. ఈ సినిమా షూటింగ్ మళంపుజ అడవుల్లో జరిగింది. సినిమా షూటింగ్ సమయంలో నన్ను ఒక స్టార్ హోటల్లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసింది.
ఆరోజు రాత్రి నేను క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను ఎదుర్కొన్నాను. పార్టీ ముగిసిన అనంతరం సినిమా హీరో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్‌గా తన గదికి రమ్మని అడిగాడు. దాంతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు. తర్వాత నా గదికి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు షూటింగ్లో పాల్గొన్నప్పటినుంచి ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఇక ఆ తరువాత సినిమాలంటే ఆసక్తి తగ్గిపోయింది. పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నాను" అని ఆమె తెలిపారు.
అయితే ఈ వీడియోలో ఆమె బాలయ్య పేరు.. సినిమా పేరు.. ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఆ హీరో బాలకృష్ణ అంటూ 'ఇండియా టుడే' ఓ కథనాన్ని ప్రచురిచింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com