Vichitra: హీరో బాలకృష్ణపై నటి విచిత్ర కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు

  • IndiaGlitz, [Wednesday,November 22 2023]

నటసింహం నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన మాజీ నటి విచిత్ర బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2001లో బాల‌కృష్ణ ‘భలేవాడివి బాసూ’ చిత్రంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శిల్పాషెట్టి, అంజల ఝవేరీ హీరోయిన్‌లుగా న‌టించ‌గా విచిత్ర గిరిజన యువతి పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని వెల్లడించింది.

ప్రస్తుతం త‌మిళ‌ బిగ్ బాస్ సీజన్7లో విచిత్ర కంటెస్టెంట్‌గా పాల్గొంది. నవంబర్ 21న జరిగిన ఓ ఎపిసోడ్‌లో మీ జీవితాన్ని మలుపుతిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు. దీంతో ఆమె సమాధానం ఇస్తూ 2001లో నేను ఓ తెలుగు సినిమాలో నటించాను. కానీ అదే నా చివరి సినిమా అయ్యింది. ఈ సినిమా షూటింగ్ మళంపుజ అడవుల్లో జ‌రిగింది. సినిమా షూటింగ్ స‌మ‌యంలో నన్ను ఒక స్టార్ హోటల్‌లో ఉంచారు. అయితే సినిమా యూనిట్ కావడం వల్ల హోటల్ మేనేజ్‌మెంట్ తమకు రాత్రిపూట పార్టీ ఏర్పాటు చేసింది.

ఆరోజు రాత్రి నేను క్యాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న‌ను ఎదుర్కొన్నాను. పార్టీ ముగిసిన అనంత‌రం సినిమా హీరో నా దగ్గర‌కు వ‌చ్చి డైరెక్ట్‌గా తన గదికి రమ్మని అడిగాడు. దాంతో నేను ఒక్కసారిగా షాకయ్యాను. నాకేమి అర్థంకాలేదు. తర్వాత నా గదికి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు షూటింగ్‌లో పాల్గొన్నప్పటినుంచి ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఇక ఆ త‌రువాత సినిమాలంటే ఆసక్తి తగ్గిపోయింది. పెళ్లి తరువాత పూర్తిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకొన్నాను అని ఆమె తెలిపారు.

అయితే ఈ వీడియోలో ఆమె బాల‌య్య పేరు.. సినిమా పేరు.. ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఆ హీరో బాలకృష్ణ అంటూ 'ఇండియా టుడే' ఓ కథనాన్ని ప్రచురిచింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

More News

Road Accident: విశాఖలో ఘర రోడ్డు ప్రమాదం.. చిన్నారులకు తీవ్ర గాయాలు..

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రైల్వే స్టేషన్‌ నుంచి సిరిపురం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

Sudigali Sudheer: కొత్తగా ప్రయత్నిస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు: సుడిగాలి సుధీర్

జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ అయిన సుడిగాలి సుధీర్ బుల్లి తెరపై సూపర్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇటీవల మూవీల్లో హీరోగా తన అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న అభ్యర్థులే ఎక్కువ..

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు 119 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి 360 మంది

National Herald: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్..రూ.752కోట్ల ఆస్తులు జప్తు

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రూ.752కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల

Pawan Kalyan: ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ ప్రచారం పక్కా.. షెడ్యూల్ ఖరారు..!

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు