Vanitha Vijaykumar:వనితా విజయ్ కుమార్‌పై దాడి, గాయాలతో సహా పోస్ట్ చేసిన నటి.. బిగ్‌బాస్ వల్లేనా..?

  • IndiaGlitz, [Sunday,November 26 2023]

నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటారు తమిళ నటి వనితా విజయ్ కుమార్ . ఆమె పెళ్లిళ్లు పెటాకులు కావడంతో పాటు పలు అంశాలపై చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీలకు తావిస్తూ వుంటాయి. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లిపై జరిగినంత చర్చ మరో తారపై జరగలేదంటే అతిశయోక్తి కాదు. మూడో వివాహంపై పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వనితా విజయ్ కుమార్‌పై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. ‘‘ నాపై ప్రదీప్ ఆంటోనీ సానుభూతిపరుడు’’ దాడి చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

అసలేం జరిగిదంటే.. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3లో వనితా విజయ్ కుమార్ కంటెస్టెంట్‌గా వెళ్లారు. ఎలిమినేట్ అయినప్పటి నుంచి సినిమాలతో పాటు బిగ్‌బాస్ తర్వాతి సీజన్‌లపై యూట్యూబ్ ఛానెల్‌లో రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 7పైనే రివ్యూలు ఇస్తున్నారు వనిత. అయితే గత రాత్రి ఎపిసోడ్ పూర్తయ్యాక.. రివ్యూ చెప్పి, భోజనం అనంతరం అర్ధరాత్రి 1 గంట సమయంలో కార్ పార్కింగ్ వైపు వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో గుర్తు తెలియని అగంతకుడు ‘‘రెడ్ కార్డ్’’ ఇస్తారా అంటూ ఆమెపై దాడి చేశాడట.

ఈ దాడి విషయాన్ని వనితా విజయ్ కుమార్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా మీద జరిగిన దారుణమైన దాడి గురించి ధైర్యంగా పోస్ట్ చేస్తున్నా.. బిగ్‌బాస్ అనేది కేవలం ఆట మాత్రమే.. ఇలా మీరు నాపై దాడి చేయడం, హింసించడం కరెక్ట్ కాదు ’’ అంటే పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 నుంచి రెడ్ కార్డ్ చూపించి మరీ హోస్ట్ కమల్ హాసన్ .. ప్రదీప్ ఆంటోనిని ఎలిమినేట్ చేయడంతో ఈ రచ్చ మొదలయ్యింది.

More News

అస్మదీయుల కోసం అడ్డగోలు జీవోలు.. బాబు కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం..

రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా టీడీపీ అధినేత చంద్రబాబు మాయలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తిమ్మిని బమ్మిని చేయడంలో ఆయనని మించిన దిట్ట ఎవరు

Bunny Vasu:సిగ్గు, లజ్జ వదిలేస్తేనే రండి.. బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు..

జీఏ2 బ్యానర్‌పై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు నిర్మించిన 'కోటబొమ్మాళి' పీఎస్ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Modi:కేసీఆర్, రేవంత్.. అందుకే కామారెడ్డిలో పోటీచేస్తున్నారు: మోదీ

పదేళ్ల కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో

Revanth Reddy: బీఆర్‌ఎస్‌కు మద్దతుగా బీజేపీ, ఈసీ వ్యవహరిస్తున్నాయి: రేవంత్

రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

BRS Party: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్‌ షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా హస్తం కండువా కప్పుకుంటున్నారు.