Vanitha Vijaykumar:వనితా విజయ్ కుమార్‌పై దాడి, గాయాలతో సహా పోస్ట్ చేసిన నటి.. బిగ్‌బాస్ వల్లేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
నిత్యం వివాదాలతో సహవాసం చేస్తుంటారు తమిళ నటి వనితా విజయ్ కుమార్ . ఆమె పెళ్లిళ్లు పెటాకులు కావడంతో పాటు పలు అంశాలపై చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీలకు తావిస్తూ వుంటాయి. వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లిపై జరిగినంత చర్చ మరో తారపై జరగలేదంటే అతిశయోక్తి కాదు. మూడో వివాహంపై పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వనితా విజయ్ కుమార్‌పై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పేర్కొన్నారు. ‘‘ నాపై ప్రదీప్ ఆంటోనీ సానుభూతిపరుడు’’ దాడి చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
అసలేం జరిగిదంటే.. బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3లో వనితా విజయ్ కుమార్ కంటెస్టెంట్‌గా వెళ్లారు. ఎలిమినేట్ అయినప్పటి నుంచి సినిమాలతో పాటు బిగ్‌బాస్ తర్వాతి సీజన్లపై యూట్యూబ్ ఛానెల్లో రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 7పైనే రివ్యూలు ఇస్తున్నారు వనిత. అయితే గత రాత్రి ఎపిసోడ్ పూర్తయ్యాక.. రివ్యూ చెప్పి, భోజనం అనంతరం అర్ధరాత్రి 1 గంట సమయంలో కార్ పార్కింగ్ వైపు వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో గుర్తు తెలియని అగంతకుడు ‘‘రెడ్ కార్డ్’’ ఇస్తారా అంటూ ఆమెపై దాడి చేశాడట.
ఈ దాడి విషయాన్ని వనితా విజయ్ కుమార్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘‘ నా మీద జరిగిన దారుణమైన దాడి గురించి ధైర్యంగా పోస్ట్ చేస్తున్నా.. బిగ్‌బాస్ అనేది కేవలం ఆట మాత్రమే.. ఇలా మీరు నాపై దాడి చేయడం, హింసించడం కరెక్ట్ కాదు ’’ అంటే పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. బిగ్‌బాస్ సీజన్ 7 నుంచి రెడ్ కార్డ్ చూపించి మరీ హోస్ట్ కమల్ హాసన్ .. ప్రదీప్ ఆంటోనిని ఎలిమినేట్ చేయడంతో ఈ రచ్చ మొదలయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com