అతడే నా బెస్ట్ మొగుడు అంటూనే విడాకులు.. 3 పెళ్లిళ్లు, ఆమెకు ఏమైనా తిక్కా!

  • IndiaGlitz, [Saturday,June 19 2021]

హాట్ నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ గురించి తెలియని వారుండరు. మోడలింగ్ ప్రపంచంలో ఒక ఊపు ఊపిన నటి కిమ్. శృంగార ఫోజులతో సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో దాదాపు 230 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

ఇక కిమ్ తరచుగా వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల కిమ్ కర్దాషియన్ తన మూడో భర్త కన్యేయ్ వెస్ట్ నుంచి విడాకులకు అప్లయ్ చేసింది. త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకుని అధికారికంగా విడిపోనున్నారు. ఇలాంటి సమయంలో కిమ్ చేసిన తాజా వ్యాఖ్యలు విమర్శలకు కారణం అవుతున్నాయి.

ఓ ఇంటర్వ్యూలో కిమ్ తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడింది. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఒక్కసారే నిజమైన పెళ్లి జరిగింది అని కిమ్ ఆసక్తికర ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు వెస్ట్ తనకు బెస్ట్ మొగుడు అని కూడా కితాబిచ్చింది. ఓ వైపు అతడితోనే విడాకులు తీసుకుంటూ అతడినే పొగడడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

తన పిల్లలపై తనకంటే వెస్ట్ కే ఎక్కువ ప్రేమ అని కిమ్ తెలిపింది. వెస్ట్ తో నా బంధం బలమైనది. అతడు అద్భుతమైన వ్యక్తి. అతడితో జరిగినదే అసలైన పెళ్లిగా భావిస్తాను అని కిమ్ చెప్పుకొచ్చింది. కిమ్ విడాకులు ప్రక్రియ ప్రారంభించగానేవెస్ట్ మరో యువతితో డేటింగ్ మొదలుపెట్టాడు. ఇరినా అనే రష్యన్ మోడల్ తో ప్రస్తుతం వెస్ట్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు.

వీరిద్దరి రిలేషన్ షిప్ చూసి ఓర్వలేక కిమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది అంటూ నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. కిమ్ మనీ మైండెడ్ అని, వెస్ట్ ని టార్చర్ చేస్తుందని.. అందుకే వారిద్దరూ విడిపోతున్నారని హాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. ఇంత రచ్చ చేసి ఇప్పుడు అతడినే పొగడడంలో అర్థం ఏంటి ? ఆమెకు ఏమైనా తిక్కా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More News

నేను అభిమానించే దర్శకులలో శేఖర్ కమ్ముల సర్ ఒకరు: ధనుష్

సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాన్ని ఎలా హద్దుకోవాలో శేఖర్ కమ్ములకు బాగా తెలుసు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు కమ్ముల చిత్రాలు పూర్తిగా భిన్నం.

లెజెండ్రీ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి.. మోడీ, కోవింద్, సచిన్ దిగ్భ్రాంతి!

లెజెండ్రీ అథ్లెట్, ప్లైయింగ్ సిఖ్ గా పేరుగాంచిన మిల్కా సింగ్(91) తుదిశ్వాస విడిచారు. గత నెలరోజులుగా మిల్కా సింగ్ కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి ఆయన్ని

హీరో ఆది కొత్త చిత్రం.. కీలక పాత్రలో సునీల్ !

హీరో ఆది సాయికుమార్ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ప్రభాస్ 'రాధే శ్యామ్' లో ఊహకు అందని కోణం..

బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా ప్రభాస్ నటించే చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సాహో ఆ అంచనాలు అందుకోలేక నిరాశపరిచింది.

సడెన్ డెసిషన్.. హెల్త్ చెకప్ కోసం యుఎస్ కి రజని

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాతే' చిత్రంలో నటిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ ఈ చిత్రానికి దర్శకుడు.