Sushmita Sen :సుస్మితా సేన్‌కు హార్ట్ ఎటాక్.. తీరిగ్గా చెప్పిన మాజీ మిస్ యూనివర్స్, ఉలిక్కిపడ్డ ఫిల్మ్ ఇండస్ట్రీ

  • IndiaGlitz, [Thursday,March 02 2023]

సీనియర్ హీరోయిన్ , మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ విషయాన్ని సుస్మిత స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తనకు యాంజియోప్లాస్టీ చేశారని, స్టంట్ వేశారని సుస్మిత పేర్కొన్నారు. తనకు చికిత్స అందించిన కార్డియాలజిస్ట్ మీది పెద్ద గుండె అంటూ తనను ప్రశంసించారని సుస్మితా సేన్ అన్నారు. తాను ఆరోగ్యంగానే వున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి సుబీర్‌సేన్ చెప్పిన విషయాలను సుస్మిత ప్రస్తావించారు. మరోవైపు సుస్మితా సేన్‌ గుండెపోటుకు గురయ్యారని తెలుసుకున్న సుస్మిత అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మిస్ యూనివర్స్‌తో దేశవ్యాప్త గుర్తింపు :

ఇకపోతే.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన సుస్మితా సేన్ , 1994లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడించారు. తర్వాత హిందీ, బెంగాలీ, తమిళ్ ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. కెరీర్‌లో పలువురితో ప్రేమాయణం సాగించిన సుస్మిత అవివాహితురాలు. ఈ క్రమంలోనే ఆమె ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూస్తున్నారు.

ప్రేమాయణాలతో గడిపేసిన సుస్మిత :

4 పదులు వయసు దాటాక తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన మోడల్ రోహ్మన్ షాల్‌తో డేటింగ్ చేశారు. 2021లో వీరిద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయ్యింది. ఈ నేపథ్యంలో 2022 జూలైలో ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీతో రిలేషన్ పెట్టుకుని సంచలనం సృష్టించారు. వీరిద్దరూ సన్నిహితంగా వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే సుస్మిత, లలిత్ విడిపోయారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఆర్య సీజన్ 3లో ఆమె నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్ త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అలాగే ట్రాన్స్‌జెండర్ శ్రీగౌరి సావంత్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న తాలి బయోపిక్‌లోనూ సుస్మితా సేన్ నటిస్తున్నారు.

More News

Foxconn:తెలంగాణకు కొనసాగుతోన్న పెట్టుబడుల ప్రవాహం.. ‘ ఫాక్స్‌కాన్ ’ భారీ ఇన్వెస్ట్‌మెంట్

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే వుంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

Mahesh Babu:కండలు తిరిగి, నరాలు కనిపించేలా... మహేశ్ బాడీని చూశారా, ఫోటోలు వైరల్

సూపర్‌స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి.. తన మార్క్ యాక్టింగ్‌తో సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేశ్‌బాబు.

Ram Charan:ఆ నాలుగు సినిమాలు నా ఫేవరేట్.. అమెరికన్ హోస్ట్‌తో చరణ్ , అవేంటో తెలుసా..?

ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది.

రామ్‌చరణ్‌ని బ్రాడ్‌పిట్ ఆఫ్ ఇండియా అన్న అమెరికన్ టీవీ హోస్ట్.. చెర్రీ రియాక్షన్ ఇదే

ఇప్పుడు తెలుగు చిత్ర సీమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ చూపు.. ఆర్ఆర్ఆర్ సినిమాపైనే వుంది. ఆస్కార్ అవార్డ్స్ బరిలో ఈ చిత్రం

Naga Shaurya: నువ్వయ్యా నిజమైన హీరో : లవర్ అయితే ఆడపిల్లను కొడతావా, సారీ చెప్పు .. గొడవకు దిగిన నాగశౌర్య

సినిమాల్లో ఎవరైనా తమ కళ్లెదుట ఆడపిల్లను కొట్టినా, వాళ్లను హింసించినా హీరోగారు వెళ్లి వారిని చితక్కొట్టి వస్తాడు.