Actress Sriya Reddy:సుజిత్ ఐదు నిమిషాలే కథ చెప్పాడు .. మైండ్ బ్లాంక్ , వెంటనే ఓజీకి ఓకే చెప్పేశా: శ్రీయా రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
అప్పుడెప్పుడో విశాల్ నటించిన తిమిరు (తెలుగులో పొగరు)లో తెలుగువారిని ఆకట్టుకున్న శ్రీయా రెడ్డి గుర్తున్నారా. ఆ చిత్రంలో తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఆమె మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వివాహం తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీయా రెడ్డి మళ్లీ బిజీ అవుతున్నారు. తెలుగు , తమిళ సినిమాల్లో వరుస ఆఫర్లు కొట్టేస్తున్నారు. అది కూడా అలాంటి ఇలాంటి ప్రాజెక్ట్‌లు కాదు. పవన్ కల్యాణ్ ఓజీ, ప్రభాస్ సలార్‌లలో శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ‘‘indiaglitz’’కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఫిట్‌నెస్ తర్వాతే ఏదైనా :
ఫిట్‌నెస్‌కు అమిత ప్రాధాన్యమిచ్చే శ్రీయా రెడ్డి.. ఇంట్లో వున్నా, షూటింగ్‌లో వున్నా ఫస్ట్ వర్కవుట్ చేసిన తర్వాతే ఏ పనైనా మొదలుపెడతానని తెలిపారు. రోజుకు ఒక్కసారే భోజనం చేస్తానని, హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని ఆమె చెప్పారు. ప్రశాంత్ నీల్ పట్టుబట్టి మరి తనను సలార్‌లో నటించేలా చేశారని శ్రీయా తెలిపారు. ఇంతపెద్ద భారీ స్టార్ క్యాస్టింగ్ వుండటంతో తనకు భయం వేసిందని.. కానీ ప్రశాంత్ నీల్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పారు.
పవన్ ప్రతి మాటా ఆయన గుండెల్లోంచి :
ఇక ఓజీలో అవకాశం గురించి చెబుతూ.. సలార్ సమయంలో ఏ కొత్త ప్రాజెక్ట్‌కి కమిట్ కాలేదని, ఆ తర్వాత చూద్దాంలే అనుకున్నానని శ్రీయా రెడ్డి తెలిపింది. అయితే ఓజీకి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రవి కే చంద్రన్ తనకు ఫోన్ చేశారని .. ఆయన తనకు చిన్నప్పటి నుంచే ఫోన్ చేశారని పేర్కొంది. ఓజీలో ఓ మంచి రోల్ వుందని , కాసేపట్లో డైరెక్టర్ మీకు ఫోన్ చేస్తారని చెప్పాడని శ్రీయా గుర్తుచేసుకున్నారు. తనకు ఫోన్‌లో కథ చెప్పడం ఇబ్బందిగా వుందని సుజిత్ అన్నారని.. తాను మాత్రం సినాప్సిస్ చెబితే దాన్ని బెట్టి ఆలోచిస్తానని అన్నానని తెలిపింది. కానీ ఐదు నిమిషాల్లో సుజిత్ చేసిన నేరేషన్‌కు తాను ఫిదా అయ్యానని.. ఐదు నిమిషాల్లోనే తాను సినిమా చేస్తున్నట్లు చెప్పానని శ్రీయా పేర్కొంది. పవన్ కళ్యాణ్ సినిమాలేవి తాను చూడలేదని.. కానీ రాజకీయాలకు సంబంధించి ఆయన చేస్తున్న స్పీచ్‌లను చూశానని తెలిపింది. పాలిటిక్స్ తనకు చాలా ఇష్టమని.. పవన్ ఏం మాట్లాడినా గుండెల్లోంచి వస్తుందని శ్రీయా ప్రశంసించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments