Shweta Basu: ముఖంలో కళ లేక.. బక్కచిక్కిపోయి, గుర్తు పట్టలేనంతగా మారిపోయిన శ్వేతాబసు ప్రసాద్

  • IndiaGlitz, [Sunday,January 15 2023]

సినీ పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ గుమ్మడికాయంత టాలెంట్ వుంటేనే సరికాదు.. ఆవగింజంత అదృష్టం కూడా వుండాలి. దీనికి తోడు కెరీర్ పట్ల చక్కని ప్లానింగ్ కూడా వుండాలి. ఈ రెండింట్లో ఏది మిస్ అయినా వారు మళ్లీ తెరపై కనిపించరు. హీరోలతో పోలీస్తే హీరోయిన్లు ఈ విషయాన్ని ఎక్కువగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వారి కెరీర్ స్పాన్ చాలా తక్కువ. వరుస హిట్లు కొడితే మహా అయితే ఐదేళ్లు, లేదంటే ఇంకో ఏడేళ్లు. కానీ విజయాలను కంటిన్యూ చేసుకోకపోతే మధ్యలోనే ఫేడ్ అవుట్ అవ్వాల్సి వుంటుంది. అలా కనుమరుగైన హీరోయిన్లు ఎందరో.

కొత్త బంగారు లోకంతో తెలుగు తెరకు పరిచయమైన శ్వేతాబసు ప్రసాద్:

ఇదిలావుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త బంగారు లోకం పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది బాలు, స్వప్న. అదే వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్. క్యూట్ స్మైల్‌తో , ఎక్కడా అనే డైలాగ్స్‌తో శ్వేత తెలుగువారిని ఆకట్టుకుంది. ఇప్పడు ఈ సినిమా చూసినా చాలా ఫ్రెష్‌గా వుంటుంది. కొత్తబంగారు లోకంతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. కానీ ఈ స్టార్‌డమ్‌ను శ్వేతాబసు ప్రసాద్ నిలబెట్టుకోలేకపోయారు. కథల ఎంపికలో తడబడటంతో పాటు ఫిట్‌నెస్‌పై ఆమె దృష్టి పెట్టకపోవడంతో బాగా బరువు పెరిగారు. పొట్టిగా వుండే శ్వేత లావు కావడంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అంతేకాదు పర్సనల్ లైఫ్‌లోనూ శ్వేత ఇబ్బందులు పడ్డారు. 2018లో డైరెక్టర్‌ రోహిత్ మిట్టల్‌ను పెళ్లాడగా.. విభేదాల కారణంగా ఏడాదిలోపే విడాకులు తీసుకుంది.

ముఖంలో కనిపించని జీవకళ:

శ్వేత బసు ప్రసాద్‌ను తెలుగు ప్రేక్షకులు చూసి చాలా రోజులవుతుంది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఆమె లుక్స్ చూసి షాకవుతున్నారు. అసలు కొత్త బంగారు లోకం సినిమాలో చూసిన శ్వేతా ఈమెనా అంటూ స్టన్ అవుతున్నారు. చబ్బీగా కనిపించిన ఈ అమ్మడు బక్క చిక్కిపోయి .. ఫేస్‌లో ఏమాత్రం కళ లేకుండా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More News

Waltair Veerayya : అనసవర సీన్‌లొద్దు.. నిర్మాతల డబ్బు వేస్ట్ చేయొద్దు : చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

సినిమాల నిర్మాణం, పరిశ్రమలోని సమస్యలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య

ప్రకృతి, సైన్స్, అనుబంధాలు, ఆరోగ్యం, ఆనందం.. 'సంక్రాంతి' వెనుక పరమార్థం ఇదే

భారతీయుల పండుగలు, ఆచార వ్యవహారాల వెనుక ఖచ్చితంగా ఏదో ఒక శాస్త్రీయత దాగి వుంటుంది.

Vande Bharat: రేపు పట్టాలెక్కనున్న సికింద్రాబాద్ - వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ .. టైమింగ్స్, ఛార్జీలు ఇవే

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభానికి సిద్ధమైంది.

'వాల్తేరు వీరయ్య' లో నాన్నగారిని చూస్తుంటే  పండగలా వుంది: సుస్మిత కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య'

Shruti Hassan : ఆరోగ్యంపై దుష్ప్రచారం.. మెంటల్  డాక్టర్‌ దగ్గరకెళ్లండి : గట్టిగా ఇచ్చిపడేసిన శృతీహాసన్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖలో జరిగింది.