Shruti Hassan : ఆరోగ్యంపై దుష్ప్రచారం.. మెంటల్ డాక్టర్ దగ్గరకెళ్లండి : గట్టిగా ఇచ్చిపడేసిన శృతీహాసన్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖలో జరిగింది. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీగా తరలిరావడంతో చిత్రయూనిట్ మంచి జోష్‌లో వుంది. అయితే ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతీహాసన్ (Shruti Haasan) రాకపోవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. అంతేకాదు... దీనికి ముందు రోజు ఒంగోలులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శృతీహాసన్.. వైజాగ్ ఈవెంట్‌కు రాకపోవడం చర్చనీయాంశమైంది. అనారోగ్యం వల్లే తాను రాలేకపోయానంటూ ఆమె ముందే సోషల్ మీడియా ద్వారా చెప్పినప్పటికీ .. దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
నన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు:
అక్కడితో ఈ వివాదానికి తెరపడలేదు. శృతీహాసన్‌కు (Actress Shruti Haasan) అరుదైన వ్యాధి సోకిందని, మానసిక సమస్యలతో సతమతమవుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై శృతీహాసన్ స్పందించారు. తాను ఎలాంటి మానసిక సమస్యలతో ఇబ్బందిపడటం లేదని, కేవలం వైరల్ ఫీవర్‌తోనే బాధపడుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తన ఆరోగ్య పరిస్ధితిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని శృతీహాసన్ పేర్కొన్నారు. తాను ఒక మానసిక నిపుణురాలిగా వ్యవహరిస్తుంటానని..తనను తాను సంరక్షించుకుంటానని ఆమె తెలిపారు. అందువల్ల తాను ఏ విధంగానూ మానసిక అనారోగ్యానికే ప్రసక్తే లేదని శృతీహాసన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్‌తోనే బాధపడుతున్నానని ఆమె క్లారిటీ ఇచ్చారు. తనను ఇబ్బంది పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారని..
ఇద్దరు లెజెండ్స్‌తో నటించే అవకాశం దక్కింది :
ఇక సినిమాల విషయానికి వస్తే.. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్యలను పూర్తి చేసిన శృతీహాసన్ (Shruti) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్నారు. దీనితో పాటు ఇంగ్లీష్ చిత్రం ‘‘ The Eye’’లో శృతీహాసన్ నటిస్తున్నారు. ఇదిలావుండగా బాలయ్య, చిరంజీవిల పక్కన నటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇద్దరు లెజెండ్స్ పక్కన నటించడం తన అదృష్టమని శృతీహాసన్ అన్నారు. వారిద్దరు మంచి డ్యాన్సర్లని.. అలాంటి వారి పక్కన డ్యాన్స్ చేయడం బాగుందని పేర్కొన్నారు.
Nice try !! And Thankyou I’m recovering well from my viral fever pic.twitter.com/oxTYevcK1D
— shruti haasan (@shrutihaasan) January 12, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments