Shriya Reddy:'గేమ్ ఆఫ్ థ్రోన్స్' రేంజ్లో "సలార్’" , ప్రభాస్ రోల్ ఎలా వుంటుందంటే : అంచనాలు పెంచేసిన శ్రీయా రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ మూవీపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు వున్నాయి. మాస్కు, యాక్షన్‌కు పెట్టింది పేరైన ప్రభాస్‌ను ప్రశాంత్ ఎలా చూపించారోనని అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అంచనాలను మరింత పెంచేలా చేశారు శ్రీయా రెడ్డి. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నారామె. ఈ నేపథ్యంలో ఆమె ‘‘indiaglitz’’కు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ప్రశాంత్ నాకూ ఫోన్ చేస్తూనే వున్నారు :
స్విట్జర్లాండ్‌లో వున్న సమయంలో ప్రశాంత్ నీల్ తనను కాంటాక్ట్ అయ్యారని, అప్పుడు తాను ఎంజాయ్ చేస్తున్నానని.. అప్పుడున్న పరిస్ధితుల్లో సినిమా చేసే ఉద్దేశ్యం లేదన్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం పట్టువదలకుండా ఆరు నెలల పాటు సినిమాకు సంబంధించిన వివరాలు, అందులో నా పాత్ర తీరుతెన్నులు వివరించేవారని శ్రీయా చెప్పింది. ఫుల్ స్క్రిప్ట్ డెవలప్ అయ్యాక... కథ చెబితే విన్నాక మైండ్ బ్లాంక్ అయ్యిందని.. ఈ మూవీ ‘‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’’ రేంజ్లో వుందని ఆమె చెప్పారు. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన కేజీఎఫ్ సిరీస్‌కు మించి ‘‘సలార్’’ వుంటుందని , ముఖ్యంగా ప్రభాస్ క్యారెక్టర్ అద్భుతంగా వుంటుందని శ్రీయా వివరించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ కూడా ఓ రేంజ్లో వుంటుందని.. వీరితో పాటు ఏడెనిమిది క్యారెక్టర్స్‌కు కూడా మంచి ఇంపార్టెన్స్ వుంటుందని శ్రీయా చెప్పింది.
సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు సలార్ :
ఇకపోతే.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సలార్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ సలార్ ను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com