అల్లు అర్జున్ నాకు లైన్ వేసేవాడు: నటి షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
వనితా విజయ్ కుమార్.. ఆమె సినిమాల్లో నటించే సమయంలో ఎందరికి తెలుసో.. తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమె ప్రేమ.. పెళ్లిళ్లు.. విడాకులు.. ఎవరైనా ఏమైనా అంటే నోరు పారేసుకుంటూ ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిపోయింది. ఏదో ఒకరకంగా ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలవడం పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా.. ప్రేమ.. చేసుకున్న మూడు పెళ్లిళ్లతో వనితా విజయ్ కుమార్ ఎదుర్కొన్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇవన్నీ ఆమె డోంట్ కేర్ అన్నట్టుగానే ఉండటమే కాదు.. ఏం చేయాలనిపించినా చేస్తూ పోతుంది.
తాజాగా వనితా విజయ్ కుమార్ టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ సందర్భంలో వనిత మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తనకు లైన్ వేసేవాడని తెలిపింది. చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీతో తమకు చాలా మంచి అనుబంధం ఉండేదని వెల్లడించింది. చిరంజీవి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు తమ ఫ్యామిలీ మొత్తం వెళ్లే వాళ్లమని తెలిపింది. ఆ సమయంలో చిరంజీవి నటించే ఓ ఇంగ్లీష్ సినిమా ఓపెనింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న అల్లు అర్జున్ సూపర్ స్టైలీష్‌గా తయారై తన వైపు చూస్తు.. తనకు లైన్ వేశాడని వనిత వెల్లడించింది.
అయితే అప్పుడు అల్లు అర్జున్‌కు 14 సంవత్సరాలు ఉంటాయని.. అతను తన కన్న చిన్నవాడు అయినా కూడా అలా తననా వైపు చూశాడని వనితా విజయ్ కుమార్ వెల్లడించింది. అంగతే కాదు.. అప్పుడు తాను ఏ కలర్ డ్రెస్‌లో ఉన్నానో కూడా ఆమె వెల్లడించడం విశేషం. అప్పుడు తాను మ్యాంగో కలర్ డ్రెస్‌లో ఉన్నానని.. కొన్ని రోజులకు బన్ని ఆ డ్రెస్‌ను ఓ ఫోన్ కాల్ మాట్లాడుతూ గుర్తు చేశాడని తెలిపింది. వనిత విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout