హీరోయిన్ కాకుండా వుంటే.. కోహ్లీలా వుండేదేమో: సమంతపై జిమ్ ట్రైనర్ ప్రశంసలు
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల స్టార్‌డమ్, కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మంచి అవకాశాలొచ్చి, ఆ సినిమాలు హిట్టయితే ఐదేళ్లు, లేదంటే పదేళ్ల పాటు వారి హవా నడుస్తుంది. లేదంటే ఫలానా సినిమాలో హీరోయిన్ ఎవరా అంటే ప్రేక్షకులు చెప్పలేని పరిస్ధితి. అందుకే దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే వుంటారు హీరోయిన్లు. దీనితో పాటు ఫిట్‌నెస్ పైనా శ్రద్ధ వుంచాల్సిందే.. ఏమాత్రం ఒళ్లు చేసినా అసలుకే మోసం వచ్చేస్తుంది. అందుకే డైట్, వర్కవుట్‌లకు తారామణులు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందులో ముందువరుసలో నిలుస్తారు సమంత.
ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సామ్.. నాటి నుంచి నేటి వరకు చెక్కు చెదరని అందంతో మెస్మరైజింగ్ చేస్తున్నారు. అదే సమయంలో వర్కవుట్స్‌ను మాత్రం మరిచిపోరు. జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ వంటి కష్టమైన వ్యాయామాలను కూడా సామ్ అలవోకగా చేసేస్తుంది. దీన్ని బట్టి సమంత జిమ్‌లో ఏ రేంజ్‌లో కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆమె ఫిట్‌నెస్ ఇలా వుందంటే అందుకు కారణంగా జిమ్ ట్రైనర్ జునైద్ షేక్. అందుకే అప్పుడప్పుడు జునైద్ షేక్ గురించి కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలోనే సమంత వర్కౌట్స్‌పై జునైద్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ముచ్చటించిన ఆయన .. ఒకవేళ సమంత హీరోయిన్ కాకుండా అథ్లెట్ అయ్యింటే విరాట్ కోహ్లీలా ఉండేదని వ్యాఖ్యానించాడు. తాను ఎంత కష్టమైన కసరత్తు చెప్పినా సమంత ట్రై చేస్తానని అంటుంది తప్పించి.. చెయ్యను అని ఎప్పుడూ చెప్పదని జునైద్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. సమంతని చూసి తాను స్పూర్తి పొందుతానని.. ‘పుష్ప’ సినిమాలో ఊ అంటావా మావ ఊఊ అంటావా సాంగ్ కోసం చాలా వర్కవుట్ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments