Samantha:సమంత స్టంట్స్ చూశారా.. సూపర్ ఉమెన్ లుక్‌లో సామ్, ఆ దెబ్బకు ప్రత్యర్థులు చిత్తే
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత.. ఈ పేరు తెలియని వారుండరు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సామ్. ఎంతమంది కొత్త హీరోయిన్లు వస్తున్నా.. ఇప్పటికీ ఆమె ప్లేస్ చెక్కు చెదరలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఏ మాయ చేశావే’’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత.. 13 ఏళ్లుగా తన ప్రస్థానం సాగిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలతో చాలా త్వరగా టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగు, తమిళ భాషల్లో సామ్ తిరుగులేని స్టార్ డమ్‌ను కొనసాగిస్తున్నారు. తన తోటి నటుడు నాగచైతన్యను పెళ్లాడిన సమంతా.. కొద్దికాలానికే ఆయనతో విడిపోయారు. వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిన ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సైతం సోకింది. వీటన్నింటితో పోరాడుతూనే సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సమంత తీరిగి మామూలు మనిషి కాగలిగారు.
సినిమా కోసం ప్రాణం పెట్టే సమంత:
ఇక సినిమాను అమితంగా ఇష్టపడే సమంత .. తన పాత్ర కోసం మేకోవర్ కావడానికి ఎంతగానో శ్రమిస్తారు. దీనికి ఎన్నో ఉదాహరణలు. జిమ్‌లో వర్కవుట్లు, తెలియని విషయాలను నేర్చుకోవడం ఇలా అన్నింట్లోనూ తనను తాను నిరూపించుకునేందుకు ఆమె శ్రమిస్తారు. ప్రస్తుతం యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో సామ్ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ‘‘ ది ఫ్యామిలీ మెన్’’ సిరీస్‌తో ఆమెలోని యాక్షన్ క్వీన్ కోణం ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం సమంత అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌లో నటిస్తోంది. ఇటీవల 'సిటాడెల్' వరల్డ్ ప్రీమియర్‌కు హాజరయ్యేందుకు గాను సామ్ లండన్‌లో ల్యాండ్ అయ్యారు. రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటిస్తున్నారు. ఇదే సిరీస్ ఇండియన్ వెర్షన్‌లో సమంత , వరుణ్ ధావన్ నటిస్తున్నారు. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
పెప్సీ కోసం స్టంట్స్ చేస్తున్న సమంత :
ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల విషయంలోనూ సమంత దూసుకుపోతున్నారు. కెరీర్‌లో ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో ఆమె నటించారు. తాజాగా అంతర్జాతీయ దిగ్గజం పెప్సీ కోసం సామ్ పనిచేస్తున్నారు. ఇది యాక్షన్‌తో కూడుకున్ని కావడంతో .. సమంత తన స్టంట్స్‌తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఈ యాడ్ వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఈ యాడ్ కోసం స్టంట్స్ షూట్ చేస్తున్న ఫోటోలను సమంత పంచుకున్నారు. రోప్స్ సాయంతో వేలాడుతూ.. గాల్లోకి దూసుకొచ్చి ఆమె ప్రత్యర్ధులపై దాడి చేస్తున్నారు. ఇది చూసిన ప్రేక్షకులు యాడ్ కోసమే ఇంతలా కష్టపడితే.. ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ కోసం ఇంకెంత కష్టపడిందోనని చర్చించుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments