Samantha Ruth Prabhu: స్వీట్ 16లో సమంత ఇలా.. ఆ క్యూట్ లుక్స్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే
Send us your feedback to audioarticles@vaarta.com
సమంత.. ఈ పేరు తెలియని వారుండరు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు సామ్. ఎంతమంది కొత్త హీరోయిన్లు వస్తున్నా.. ఇప్పటికీ ఆమె ప్లేస్ చెక్కు చెదరలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఏ మాయ చేశావే’’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత.. 13 ఏళ్లుగా తన ప్రస్థానం సాగిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలతో చాలా త్వరగా టాప్ హీరోయిన్గా ఎదిగారు. తెలుగు, తమిళ భాషల్లో సామ్ తిరుగులేని స్టార్ డమ్‌ను కొనసాగిస్తున్నారు. తన తోటి నటుడు నాగచైతన్యను పెళ్లాడిన సమంతా.. కొద్దికాలానికే ఆయనతో విడిపోయారు. వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిన ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సైతం సోకింది. వీటన్నింటితో పోరాడుతూనే సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సమంత తీరిగి మామూలు మనిషి కాగలిగారు.
ఇకపోతే.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే సమంత ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, సినిమా సంగతులను అభిమానులతో పంచుకుంటూ వుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తాను 16 ఏళ్ల వయసులో వున్నప్పటి ఫోటోను సామ్ షేర్ చేశారు. ఈ ఫోటోల పూల పూల దుస్తుల్లో , స్టైలీష్ జ్యూవెలరీలో సమంత కనిపించారు. ఇది ఆమె డిగ్రీ చదువుతున్న రోజుల్లో మోడలింగ్ కోసం తీసుకున్న ఫోటోగా తెలుస్తోంది. సినిమాల్లోకి రాకముందు చదువు, తన వ్యక్తిగత అవసరాల కోసం సమంత మోడలింగ్ చేసినట్లు పలుమార్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తోన్న సమంత:
ఇక సినిమాల విషయానికి వస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన'శాకుంతలం' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయినప్పటికీ సమంత నటన, మేకోవర్ అభిమానులకు కొత్తదనం పంచింది. ఈ క్రమంలో సమంత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం అమెరికన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్‌తో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాలో సమంత నటిస్తున్నారు. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘ఖుషీ’ టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత సామ్ ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments