Samantha : చేతిలో జపమాలతో కొత్తగా సమంత..మునుపటి ఛార్మింగ్ లేదన్న నెటిజన్ , కౌంటరిచ్చిన సామ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్గా తొలి నుంచి వున్న ఫేమ్కి తోడు, నాగచైతన్యకి విడాకులు, ఇటీవల అనారోగ్యం బారినపడటంతో సమంత (Samantha) ఏం చేసినా.. ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. చివరికి ఆవిడ కట్టుబొట్టు కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు సమంత. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలతో కృంగిపోయి వున్న ఆమెకు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సామ్ మరింత డల్ అయ్యారు. అయినప్పటికీ సమంత యశోదా, శాకుంతలం సినిమాలు చేశారు.
ఎక్కడికి వెళ్లినా సమంత చేతిలో జపమాల:
ఈ నేపథ్యంలో శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత (Actress Samantha)పాల్గొన్నారు. అనంతరం ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా ఆమె చేతిలో ఒక జపమాల వుండటం చర్చనీయాంశమైంది. ఇటీవల ముంబై విమానాశ్రయంలోనూ, శాకుంతలం సినిమాలోనూ సమంత ఇదే జపమాలతో కనిపించింది. దీనకి కారణం లేకపోలేదు. మయోసైటిస్ వ్యాధి బారినపడటంతో ప్రస్తుతం సమంత చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం, మనశ్శాంతి కోసం ప్రతిరోజూ 10,008 శ్లోకాలతో జపం కూడా చేస్తున్నారు. మలయాళీ క్రిస్టియన్లు కూడా ఇలాంటి పూసలు వున్న మాలతో ‘రోసరీ’ చేస్తారు.
నాలాగా నెలలు నెలలు చికిత్స తీసుకోవద్దు :
కారణం ఏదైనా సరే ఇటీవలి కాలంలో సమంతలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువైంది. తొలుత క్రైస్తవ మతంలో వున్న సామ్.. తర్వాత హిందూ మతాన్ని స్వీకరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ని ఆమె ఫాలో అవుతున్నారు. జగ్గీ వాసుదేవ్ నిర్వహించిన కార్యక్రమాల్లో సమంత పాల్గొంటున్నారు. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా వున్న సమస్యల నుంచి బయటపడేందుకు సామ్ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు. ఇక.. సమంతలో మునుపటి అందం, ఛార్మింగ్ లేదంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. తనలా ఎవ్వరూ నెలల తరబడి చికిత్స తీసుకోకూడదని తాను కోరుకుంటానని, అలాగే తాను అందిస్తున్న ప్రేమ నుంచి గ్లో పొందాలంటూ సామ్ కౌంటరిచ్చారు.దీంతో ఆమెకు మద్ధతుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. సమంత పూర్తిగా కోలుకుని ముందులా ఆరోగ్యంగా వుండాలని వారు ఆకాంక్షిస్తున్నారు.
ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు సమంత :
ఇదిలావుండగా.. అత్యంత భారీ బడ్జెట్తో గుణశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిల్రాజు శాకుంతలంకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి, మధుబాల, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న శాకుంతలంను రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments