Samantha: పూర్తి ఆధ్యాత్మిక మార్గంలో సమంత.. 600 మెట్లెక్కి పళని ఆలయానికి, మెట్టు మెట్టుకి కర్పూరం వెలిగిస్తూ..
Send us your feedback to audioarticles@vaarta.com
జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకులు, అనారోగ్య సమస్యల నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో ఆమె బాగా క్రుంగిపోయారు. ఎక్కువగా ఇంటికే ఆమె పరిమితమవుతున్నారు. స్నేహితులతో తరచుగా ఔటింగ్‌కు వెళ్లే విషయంలోనూ సమంత పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తన ఆరోగ్యం, కెరీర్‌కే ఆమె ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఇదిలావుండగా.. జీవితంలో ఇబ్బందుల రీత్యా సామ్ పూర్తి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయారు.
ఎక్కడికి వెళ్లినా సమంత చేతిలో జపమాల:
ఇటీవల శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. అనంతరం ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా ఆమె చేతిలో ఒక జపమాల వుండటం చర్చనీయాంశమైంది. ఇటీవల ముంబై విమానాశ్రయంలోనూ, శాకుంతలం సినిమాలోనూ సమంత ఇదే జపమాలతో కనిపించింది. దీనకి కారణం లేకపోలేదు. మయోసైటిస్ వ్యాధి బారినపడటంతో ప్రస్తుతం సమంత చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం, మనశ్శాంతి కోసం ప్రతిరోజూ 10,008 శ్లోకాలతో జపం కూడా చేస్తున్నారు. మలయాళీ క్రిస్టియన్లు కూడా ఇలాంటి పూసలు వున్న మాలతో ‘రోసరీ’ చేస్తారు.
600 మెట్లెక్కి పళని సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్న సమంత:
ఈ మధ్యకాలంలో ఏమాత్రం ఖాళీ దొరికినా దేవాలయాలను సందర్శిస్తున్నారు సమంత. తాజాగా తమిళనాడులోని ప్రఖ్యాత పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించారు సామ్. దేశవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయాన్ని దర్శించాలంటే దాదాపు 600కు పైగా మెట్లు ఎక్కాలి. ప్రస్తుత మయోసైటిస్ కారణంగా కండరాలు ఇబ్బంది పెడుతున్నా లెక్కచేయకుండా సామ్ 600 మెట్లను ఎక్కేశారు. అంతేకాదు.. ప్రతి మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ.. ముందుకు సాగారు. ఆమె కోసం తమిళ దర్శకుడు సీ ప్రేమ్ కుమార్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. సెలబ్రెటీ అయినప్పటికీ సామాన్య భక్తురాలిగా సల్వార్ కమీజ్ ధరించి సింపుల్‌గా వున్నారు సామ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments