Samantha Health : సమంతకు తీవ్ర అస్వస్థత.. మేనేజర్ క్లారిటీ
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు సమంత. అయినప్పటికీ మొక్కొవోని ఆత్మవిశ్వాసంతో వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. అంతేకాదు.. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఇలా జీవితాన్ని లాగిస్తూ వుండగా సామ్ జీవితంలో మరో కుదుపు చోటు చేసుకుంది. లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో సమంతా బాధపడుతున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని తొలుత పుకార్లుగా అంతా కొట్టిపారేశారు. కానీ స్వయంగా సమంత అది నిజమేనని ‘‘మయోసైటిస్’ అనే వ్యాధి బారిన తాను పడినట్లు ఆమె ప్రకటించారు. దీంతో అభిమానులు, సినీ ప్రపంచం షాక్‌కు గురైంది. యశోదా సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సామ్ కన్నీటి పర్యంతమయ్యారు.
ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా ‘‘గెట్ వెల్ సూన్ సామ్’’ :
మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే సమంత ఆరోగ్యంపై ఆన్‌లైన్‌లో గాలి వార్తలు చక్కర్లు కొట్టాయి. సమంత తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని ఆ వార్తల్లో రాశారు. దీంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ సామ్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయ్యింది. అలాగే సమంత సిబ్బందిని ట్యాగ్ చేస్తూ ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.
ఆ వార్తలు నమ్మొద్దు:
వ్యవహారం శృతిమించడంతో సమంత మేనేజర్ స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. సమంత ఇంట్లోనే వున్నారని, ఆరోగ్యం కూడా బాగానే వుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో మాదిరిగానే జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారని మేనేజర్ వెల్లడించారు. సమంత ఆరోగ్యం గురించి వస్తున్న వదంతుల్ని నమ్మొద్దని ఆయన సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com