Samantha: సమంత ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్ ఇదే.. ఆ థెరపీ చేయించుకుంటున్న సామ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్గా తొలి నుంచి వున్న ఫేమ్కి తోడు, నాగచైతన్యకి విడాకులు, ఇటీవల అనారోగ్యం బారినపడటంతో సమంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా వైరల్ అవుతోంది. చివరికి ఆవిడ కట్టుబొట్టు కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. కొద్దిరోజుల క్రితం మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు సమంత. వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యలతో కృంగిపోయి వున్న ఆమెకు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సామ్ మరింత డల్ అయ్యారు. అయినప్పటికీ సమంత యశోదా, శాకుంతలం సినిమాలు చేశారు.
వర్కవుట్లలో సమంత బిజీ:
వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులతో పాటు అనారోగ్యం నుంచి సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయినప్పటికీ సమంత ఆరోగ్యంపై ఆమె అభిమానులు టెన్షన్ పడుతూనే వున్నారు. దాదాపు ఎడెనిమిది నెలల నుంచి సమంత ఈ వ్యాధితో పోరాడారు. అయితే ఇప్పుడు ఆమె సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. పోయిన ఫిట్నెస్ను, ఛార్మింగ్ను తిరిగి పొందేందుకు సామ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. సమంత హెల్త్ విషయంగా ఒక అప్డేట్ ఇచ్చారు. మయోసైటిస్‌కి సంబంధించి రి ఐవీఐజీ(ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబలిన్ థెరఫీ) సెషన్‌కి హాజరైనట్లు సామ్ తెలిపింది. అందుకు సంబంధించిన ఓ వీడియో పంచుకుంటూ `న్యూ నార్మల్` అంటూ క్యాప్షన్ పెట్టారు.
విడుదలకు సిద్ధమైన శాకుంతలం :
ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సరసన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తుండగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఇందులో దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్, గౌతమి, మధుబాల, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments