సినీనటి సమంతకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత తీవ్ర అస్వస్దతకు గురయ్యారు. ఆదివారం కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి ఆమె తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు సామ్. ఈ నేపథ్యంలో ఆమె చికిత్స నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ అసుపత్రిలో చేరనున్నారు.
కాగా.. ఓ షాపింగ్ మాల్ ప్రారంభించేందుకు సమంత కడప వచ్చారు. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు, నగర ప్రజలు ఎగబడ్డారు. ఒకానొక దశలో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు సైతం సాధ్యం కాలేదు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం సమంత కడపలోని పెద్ద దర్గాను దర్శించి.. చాదర్‌ను సమర్పించారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత క్రేజ్ బాగా పెరిగింది. వరుస ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఏకంగా హాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్‌లో రాజీ పాత్రకు గాను ఫిలింఫేర్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇకపోతే అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పుష్పలో సమంత స్పెషల్ సాంగ్ సైతం చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఇంద్రావతి చౌహాన్ ఆలపించారు. కేవలం ఐదు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన ఈ పాట కోసం సమంత ఏకంగా కోటి 30 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments