సమంత కండీషన్స్ పెట్టింది...
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకప్పుడు పరభాషా హీరోయిన్లకు ప్రాధాన్యం తక్కువ. ఈరోజుల్లో దిగుమతి అయ్యే హీరోయిన్లకు డిమాండ్ కాస్త ఎక్కువే. షూటింగ్ టైమ్‌లో వాళ్ళు పెట్టే కండీషన్స్ అన్నింటికీ దర్శకనిర్మాతలు తలలు ఊపాల్సిందే. లేకపోతే అర్ధాంతరంగా షూటింగ్‌కి డుమ్మా కొడతారు. వారిలో కొంతమంది డెడికేటెడ్‌గా వర్క్ చేసే వారు కూడా లేకపోలేదు. ఏ హీరోయిన్ అయినా కండీషన్స్ మాత్రం కామనే. ఈ విషయంలో సమంత కూడా మినహాయింపు కాదు. త్వరలోనే నాగచైతన్యతో మూడు ముళ్లు వేయించుకోనున్న ఈ చెన్నై భామ తమిళ్‌లో చేస్తున్న శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రం షూటింగ్ తెన్ కాశీలో జరుగుతోంది. షూటింగ్ మొదటిరోజే దర్శకుడు పోన్‌రామ్‌ని పిలిచి కొన్ని కండీషన్స్ పెట్టిందట. సమంతకి స్కిన్ ఎలర్జీ వున్న విషయం తెలిసిందే. దానివల్ల తాను ఎండలో ఎక్కువ సేపు వుండలేనని, ఎండ లేనప్పుడే తనకి సంబంధించిన షాట్స్ తియ్యాలని చెప్పిందట. అలాగే షాట్ చేస్తున్నప్పుడు తనపై ఎండ పడకుండా క్లాత్ ఏర్పాటు చేయాలని మరో కండీషన్ పెట్టిందట. తనకు వున్న ఆరోగ్య సమస్య కారణంగా సమంత ఈ కండీషన్స్ పెట్టి వుండొచ్చు. కానీ, ఏ కారణం లేకుండానే దర్శకనిర్మాతల్ని తమ కండీషన్స్‌తో కాల్చుకు తినే కొంతమంది హీరోయిన్ల కంటే సమంత నయమే అనిపిస్తోంది కదూ!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com