హీరోయిన్ సమంతకు .... చాంపియన్స్‌ ఆఫ్‌ ది చేంజ్‌ తెలంగాణ 2021 అవార్డ్

  • IndiaGlitz, [Saturday,February 26 2022]

ఓ వైపు క్షణం తీరిక లేకుండా సినిమా షూటింగ్‌లలో పాల్గొంటారు సమంతా. దీనితో పాటు తనను ఇంతటి వారిని చేసిన సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సామాజిక కార్యక్రమాలకు కూడా సమయం కేటాయిస్తూ వుంటారామె. ఈ క్రమంలోనే సమంతను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ తెలంగాణ 2021 అవార్డును సమంత అందుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ తాజ్‌డెక్కన్‌లో ఇంటరాక్టివ్‌ ఫోరమ్‌ ఆన్‌ ఇండియన్‌ ఎకానమీ (ఐఎఫ్‌ఐఈ) సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సమంతకు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను పెంపొందిస్తూ.. సమాజసేవ, సామాజిక విలువల అభివృద్ధి, పలు రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ అవార్డులను అందజేశారు.

సమంతతో పాటు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్, డాక్టర్‌ డీ నాగేశ్వర్‌రెడ్డి, మైహోం గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, తెలంగాణ ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, తెలంగాణ ఇంచార్జి డీజీపీ అంజనీకుమార్‌, భారత మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ అజారుద్దీన్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సినీ నటులు మహేశ్‌బాబు, అల్లుఅర్జున్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, జ్యోత్స్న రెడ్డి, సుధారాణి రెడ్డి, శశి జాలిగామ, మనీశ్‌ దోషి, దిరిసాల నరేశ్‌ దరి, డాక్టర్‌ రాజా తంగప్పన్‌ తదితరులకు ఈ అవార్డును అందజేశారు.

ఇకపోతే.. నాగచైతన్యతో విడాకులు .. ఆతర్వాత జరిగిన పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతోన్న సమంత ప్రస్తుతం కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. ఆమె అనేక కొత్త ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమాతో బిజీగా వున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న విడుదల చేశారు. మైథలాజికల్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత లుక్ అదిరిపోయింది. అలాగే సామ్ హీరోయిన్ గా యశోద టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం రూ. 3 కోట్లతో ఖరీదైన సెట్స్ నిర్మిస్తున్నారు.

More News

జీ`5 ఓటిటి లో 500 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో "బంగార్రాజు" విజయ విహారం...

వినోదాత్మక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు డైరెక్ట్‌-టు-డిజిటల్‌ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో

భీమ్లా నాయక్: కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ చెబుతూ.. బెజవాడలో పవన్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ, వైరల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు ఏపీ ప్రభుత్వం నుంచి గట్టి అవరోధాలు ఎదురైన సంగతి తెలిసిందే.

మార్చి 1న రామారావు ఆన్ డ్యూటీ టీజర్.. రిలీజ్ డేట్ కూడా చెబుతారేమో..?

మహారాజా రవితేజ వరుసగా ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్ధుల అవస్థలు ... విమాన ఖర్చులు భరించండి: అధికారులకు జగన్ ఆదేశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అన్ని దేశాలు వారి పౌరుల క్షేమ సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నల్గొండలో కుప్పకూలిన హెలికాఫ్టర్... ఇద్దరు మృతి, హృదయ విదారకంగా దృశ్యాలు

తమిళనాడులోని వెల్లింగ్టన్‌ వద్ద సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిన ఘటన దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.