Renu Desai: రేణూ దేశాయ్‌కి హార్ట్ ప్రాబ్లమ్.. కోలుకుని తిరిగొస్తానంటూ ఎమోషనల్ పోస్ట్, ఉలిక్కిపడ్డ అభిమానులు
- IndiaGlitz, [Wednesday,February 15 2023]
టాలీవుడ్ టూ కోలీవుడ్ ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా హీరోయిన్ల ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా పలువురు భామలు అనారోగ్యం బాధపడుతున్నారు. సమంత, పూనమ్ కౌర్, హంసా నందిని, మమతా మోహన్ దాస్ ఇలా చెప్పుకుంటే పోతే ఆ లిస్ట్ ఇక్కడితో ఆగదు. పలువురు అలనాటి హీరోయిన్లు కూడా తమ ఫలానా అనారోగ్యం బారినపడ్డామని చెబుతూ కన్నీటిపర్యంతమవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
కోలుకుని తిరిగొస్తానంటూ రేణూ పోస్ట్ :
గత కొంతకాలంగా తాను గుండె, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని.. వీటిని ఎదుర్కొంనేందుకు ప్రయత్నిస్తున్నట్లు రేణూ చెప్పారు. జీవితంలో ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా .. ఎవ్వరూ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకూడదని ఆమె సూచించారు. సమస్య ఏదైనా నవ్వుతూ ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి.. నేను కూడా ఇప్పుడు నా అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్నా, మందులు వాడుతున్నా, యోగా చేస్తున్నానని రేణూ దేశాయ్ తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుని షూటింగ్‌లకు హాజరవుతానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన ప్రేక్షకులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.
టైగర్ నాగేశ్వరరావుతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ :
ఇదిలావుండగా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రేణూ దేశాయ్. ఈ సినిమా సమయంలో పవన్-రేణూ మధ్య ప్రేమ చిగురించడంతో ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అనంతరం పెళ్లి పీటలెక్కారు. ఈ దంపతులకు అకీరా నందన్, ఆద్యా సంతానం. అయితే అనుకోని కారణాలతో వీరిద్దరూ వీడిపోగా.. పవన్ కల్యాణ్ ఉక్రెయిన్‌కు చెందిన అన్నాలెజ్నోవాను పెళ్లాడారు. కానీ రేణూ మాత్రం ఒంటరిగా పిల్లలతో కలిసి వుంటున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా వుంటున్న రేణూ దేశాయ్.. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న ‘‘టైగర్ నాగేశ్వరరావు’’తో లాంగ్ గ్యాప్ అనంతరం తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.