చిరంజీవి కోసమే ఐటెం సాంగ్.. ఇక జీవితంలో మళ్లీ చేయను : రెజీనా
Send us your feedback to audioarticles@vaarta.com
రెజీనా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ కావడం ఖాయమని సినీ జనాలు, ప్రేక్షకులు భావించారు. అందం, అభినయంతో పాటు హద్దు దాటేందుకు సైతం ఆమె సై అనడంతో మంచి ఆఫర్లే వస్తాయని భావించారు. కానీ ఆ అంచనాలు తలక్రిందులయ్యాయి. సెకండ్‌గ్రేడ్ హీరోలనే గానీ స్టార్ హీరోల దృష్టిలో రెజీనా పడలేకపోయింది. ఆమె కెరీర్‌లో స్టార్ హీరో సరసన చేసింది ఒక్క రవితేజతోనే. అది కూడా సెకండ్ హీరోయిన్‌గానే. తర్వాత రెజీనా ఎన్నో ఆశలు పెట్టుకున్న 'శౌర్య, సౌఖ్యం' చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి రెజీనా నటించిన 'పిల్లా..నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాలకు మంచి విజయం సాధించినా క్రెడిట్ ఆమెకు దక్కలేదు. దీంతో మధ్యలో గ్యాప్ ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సత్తా చాటడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ఆచార్య' సినిమాలోని ఐటెం సాంగ్ లో రెజీనా తళుక్కున మెరిసింది. చిరంజీవితో కలిసి స్టెప్పులేసింది. దీంతో సినీ జనాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రెజీనాకు అవకాశాలు రాక ఐటెం సాంగ్స్‌లోకి దిగిందా.. లేక తనలో కొత్త వెర్షన్‌ను చూపిస్తోందా అంటూ చెవులు కొరుక్కున్నారు.
ఈ నేపథ్యంలో రెజీనా స్పందించారు. ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ చిరంజీవి కోసమే చేశానని చెప్పారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పాటల్లో నటించలేదని.. కానీ ఆచార్య మేకర్స్ నుంచి కాల్ వచ్చి చిరంజీవి గారి పక్కన ఐటెం సాంగ్ చేయాలని చెప్పడంతో మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేశానని రెజీనా వెల్లడించింది. తన జీవితంలో ఐటెం సాంగ్ చేయడం ఇదే తొలిసారి అని.. అలానే ఇదే ఆఖరిసారి అని క్లారిటీగా చెప్పేసిందామె.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments