ఎద సౌందర్యం కోసం అసభ్యకరమైన పని చేయమన్నారు: హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. నటీమణులుగా ఎదగాలనే కలలతో వచ్చిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే సంఘటనలు చిత్ర పరిశ్రమలో వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే బాడీ షేమింగ్ కి కూడా తాము గురవుతున్నట్లు కొందరు నటీమణులు తరచుగా మాట్లాడుతున్నారు.
ఇదీ చదవండి: భారీ అంచనాలతో బాలయ్య హంటింగ్ షురూ.. అంతా అతడి చేతుల్లోనే!
ఓ ఇంటర్వ్యూలో హాట్ బ్యూటీ రిచా చద్దా తనకు ఎదురైన బాడీ షేమింగ్ గురించి రివీల్ చేసింది. నేను ఏ ఫిలిం మేకర్ ని కలిసినా వారు బాడీ షేమింగ్ చేస్తూ నా కాన్ఫిడెన్స్ దెబ్బతీసేవారు. మరి కొందరు అసభ్యంగా కామెంట్స్ చేశారు. కొందరు ఇంకా బరువు పెరగాలని చెబితే.. మరికొందరు తగ్గాలి అని అంటారు.
నీ ముక్కు బాగాలేదు.. సర్జరీ చేయించుకో అని కొందరు అన్నారు. పెదవులు చిన్నవిగా ఉన్నాయి.. వాటిని కూడా పెంచాలి అని కొందరు అన్నారు. మరికొందరు అసభ్యంగా కామెంట్ చేస్తూ.. ఎద సైజ్ పెరగడం కోసం ఓ అసభ్యకరమైన పని చేయమని సూచించారు అని రిచా చద్దా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
ప్రస్తుతం అందం కోసం ఉపయోగిస్తున్న బ్యూటీ పద్ధతులు ఆరోగ్యకరమైనవి కావు. ఒకసారి పాతరోజులు గుర్తు చేసుకుందాం.. అప్పట్లో హీరోయిన్లు ఎలా ఉండేవారు.. ఇండియన్ స్టైల్ లో ఉండేవారు. అలా ఉండడం ఆరోగ్యకరం. కానీ ప్రస్తుతం 12 ఏళ్ల అమ్మాయి కూడా కేలరీలు లెక్క గురించి మాట్లాడుతోంది.
ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఫుడ్ తినకుండా డైటింగ్ అంటున్నారు. వెస్ట్రన్ పద్ధతులు చూసి మనం అందంగా లేము అనుకోవడం పొరపాటు.. అలాంటి అపోహలు ఉండడం ఒక డిసార్డర్ లాంటిదే అని రిచా చద్దా తెలిపింది.
రిచా చద్దా గత ఏడాది షకీలా బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిచా పలు చిత్రాల్లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments