Rashmika Mandanna:రష్మికకు కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ అపార్ట్‌మెంట్స్ అంటూ ప్రచారం.. శ్రీవల్లి కామెంట్ ఇదే

  • IndiaGlitz, [Sunday,February 12 2023]

రష్మిక మందన్నా.. ఇప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా చలామణి అవుతున్న నటి. మాతృభాష కన్నడ కంటే తెలుగులో సినిమాలు చేసిన తర్వాతే ఈమెకు స్టార్ డమ్ వచ్చింది. ఛలో సినిమా తర్వాత రష్మిక ఓవర్‌నైట్ స్టార్ అయ్యింది. అందులో ఈమె అందానికి, నటనకు యువత ఫిదా అయ్యారు. ఆ తర్వాత కాలం కలిసి రావడంతో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు సక్సెస్ కావడంతో ఏకంగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత భీష్మ, పుష్ప వంటి హిట్లతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో రెండు చేతుల సంపాదిస్తోంది.

విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో పడిందంటూ వార్తలు:

మామూలు వ్యక్తులనే సోషల్ మీడియాలో ఆడుకునే నెటిజన్లు.. మరి ఈ రేంజ్‌లో వున్న రష్మికను వదులుతారా చెప్పండి. అందుకే ఆమె సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంపైనా రకరకాల గాసిప్స్ వినిపిస్తూ వుంటాయి.మొన్నామధ్య రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో రష్మికకు రిలేషన్ అంటగట్టేసి కథనాలను వండివార్చారు. తర్వాత వీరిద్దరి విషయంలో మీడియా సైలెంట్ అయ్యింది.

ఐదు నగరాల్లో రష్మికకు లగ్జరీ అపార్ట్‌మెంట్స్:

ఇదిలావుండగా.. గత ఐదేళ్ల కాలంలో రష్మిక భారీగా ఆస్తులను కూడబెట్టిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్, గోవా, కూర్గ్, ముంబై, బెంగళూరు నగరాల్లో రష్మిక లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ కొనేసిందని.. దీనితో పాటు ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేసిందని సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమన్నాయి. ఇది ఆ నోటా ఈ నోటా రష్మిక వరకు వెళ్లడంతో ఆమె స్పందించింది. ‘‘ఇదంతా నిజమైతే బాగుండు’’ అని రిప్లయ్ ఇచ్చింది. ఎవరిని నోప్పించకుండా ఆమె చాలా తెలివిగా ఈ ప్రచారాన్ని ఖండించింది.

రష్మిక చేతిలో పాన్ ఇండియా సినిమాలు:

ఇక సినిమాల విషయానికి వస్తే.. హిందీలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ‘‘యానిమల్’’ మూవీలో రష్మిక నటిస్తోంది. దీనికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తెలుగులో సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో పుష్ప 2లో ఆమె నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.