Actress Purna : తల్లయిన పూర్ణ.. పండంటి బాబుకు జన్మనిచ్చిన అవును హీరోయిన్

  • IndiaGlitz, [Tuesday,April 04 2023]

తన అభిమానులకు సినీనటి పూర్ణ శుభవార్త చెప్పారు. ఈరోజు తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రిలో బెడ్‌పై వున్న ఫోటోను పూర్ణ షేర్ చేశారు. అందులో తనకు వైద్యం అందించిన డాక్టర్లు, సిబ్బంది కూడా వున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు చిన్నారిని ఆశీర్వదిస్తూ.. పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

శ్రీమహాలక్ష్మీతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ:

కాగా.. కేరళకు చెందిన పూర్ణ .. మోడల్‌గా, క్లాసికల్ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం శ్రీమహాలక్ష్మీ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈమె హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌ను అందుకోలేకపోయింది. సీమ టపాకాయ్, నువ్విలా నేనిలా, లడ్డూ బాబు, అవును, అవును 2, శ్రీమంతుడు, దృశ్యం, అఖండ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

గతేడాది అక్టోబర్‌లో దుబాయ్ వ్యాపారవేత్తను పెళ్లాడిన పూర్ణ:

తెలుగు , తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన పూర్ణ.. అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు జడ్జిగా అలరించింది. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్‌లో దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అసీఫ్ అలీని పెళ్లాడారు. ఆ తర్వాత కొద్దిరోజులకే తాను గర్భం దాల్చినట్లు పూర్ణ ప్రకటించారు. ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితులు పూర్ణ సీమంతాన్ని గ్రాండ్‌గా జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

More News

Pawan Kalyan:ఢిల్లీలో బిజీబిజీగా జనసేనాని .. అందరినీ కలిసిన తర్వాత మాట్లాడతా : మీడియాతో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో వరుసగా రెండో రోజు బిజీబిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌తో

SSC Exams:నిన్న పేపర్ లీక్.. ఈరోజు ఆన్సర్ షీట్ల కట్ట మిస్సింగ్, తెలంగాణలో ఏం జరుగుతోంది..?

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్ట కాస్తంత మసకబారింది. ఈ కేసులో రంగంలోకి దిగిన సిట్ ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోంది.

Renu Desai:మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు .. ‘‘కొందరు’’ అంటూ రేణూ దేశాయ్ పోస్ట్, వైరల్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రేణూ దేశాయ్.

Mission: Chapter 1:నాలుగు భాష‌ల్లో అరుణ్ విజ‌య్ భారీ చిత్రం ‘మిషన్:  చాప్ట‌ర్ 1’

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను రూపొందిస్తూ వ‌రుస స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకుంటున్నారు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌రన్‌.

Pawan Kalyan:కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ .. కమలనాథుల వ్యూహం అదేనా..?

దక్షిణాదిలో వున్న పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే.