పెళ్లికి ముందే తల్లి అయిన మరో హీరోయిన్!
- IndiaGlitz, [Saturday,November 02 2019]
బాలీవుడ్ భామ అమీజాక్సన్ పెళ్లి కాకుండానే గర్భం దాల్చి.. పండండి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో పెద్ద హడావుడి జరిగింది. అమ్మాయి అమ్మగా మారే ప్రక్రియ చాలా పవిత్రంగా ఉంటుందని.. పెళ్లి తర్వాత అమ్మ అవుతుందంటే రెండు కుటుంబాలు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతాయన్న విషయం విదితమే. అయితే ఈ మధ్య పెళ్లి కాకుండానే హీరోయిన్లు తల్లి కావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి ఇలాంటి ఘటనలు ఇప్పుడేమీ కొత్తకాదు.. ఎప్పట్నుంచో వస్తున్నవే.
తాజాగా.. ఓ బాలీవుడ్ బ్యూటీ పెళ్లికి ముందే తల్లయ్యింది. ఇక్కడ లాజిక్ ఏమిటంటే.. ఆ బ్యూటీకి ఆల్రెడీ పెళ్లయ్యి విడాకులు తీసుకున్న తర్వాత.. మరొకరితో డేటింగ్ చేసి గర్భం దాల్చింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా..? ఆమె మరెవరో కాదండోయ్ ‘కల్కి కొచ్లిన్’. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్యే ఈమె. ఆయనతో విడిపోయిన అనంతరం మరో ప్రియుడ్ని వెతుక్కున్న ఈ భామ తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే.. పెళ్లికి ముందు ఇలా చేయడమేంటని కొందరు ప్రశ్నించగా ఆమె గట్టిగానే పీకుతోంది కూడా.
‘పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఏదో తప్పు చేసినట్లుగా ఈ సమాజం ఎందుకు చూస్తోందో అర్థం కావట్లేదు. ప్రస్తుతం నేను నా ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో..? పెళ్లి వరకు వెళ్తుందో..? మధ్యలోనే ఈ బంధం పెటాకులవుతుందో వేచి చూడాల్సిందే మరి.