pranitha subhash: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత.. ఎమోషనల్ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ సినీనటి ప్రణీత తల్లయ్యారు. ఆమె శుక్రవారం సాయంత్రం పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చారు. సోషల్ మీడియా ద్వారా ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి గైనకాలజిస్టు అవ్వడం తన అదృష్టమని... అపార అనుభవం ఉన్నప్పటికీ ఆమె తన ప్రసవం సమయంలో ఎమోషనల్ అయిందని ప్రణీత తెలిపారు. తన డెలీవరీ తేలికగా అయ్యేలా చేసిన డాక్టర్ సునీల్ ఈశ్వర్, డాక్టర్ సుబ్బు, వారి బృందానికి ప్రణీత కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్నిరోజులుగా నమ్మశక్యం కాని రీతిలో కాలం గడిచిపోయిందన్నారు. మేరకు తన బిడ్డను చేతులతో పట్టుకున్న ఫొటోను ఆమె ట్వీట్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రణీతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సీక్రెట్‌గా ప్రణీత మ్యారేజ్:
కాగా.. ‘పోక్రి’ అనే కన్నడ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన ప్రణీత.. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ‘బావ’, ‘అత్తారింటికి దారేది’, ‘రభస’ తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది మే లో వ్యాపారవేత్త నితిన్ రాజును ఆమె పెళ్లాడారు. సీక్రెట్ పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రణీత తన పెళ్లి గురించి ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడింది. కానీ చివరకు పెళ్లి తేదీ నాడు ఆమె వివాహానికి సంబంధించిన విషయాలు వైరల్ కావడంతో తన సోషల్ మీడియా ద్వారా పెళ్లి విషయాన్ని ప్రణీత అధికారికంగా ప్రకటించింది . ఇకపోతే.. కరోనా లాక్డౌన్ సమయంలో ఎంతోమందికి సాయం చేసిన ప్రణీత తన మంచి మనసు చాటుకున్నారు.
ఏప్రిల్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్:
మరోవైపు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ సైతం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్.. ముంబయి వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం వారిద్దరూ 2020 అక్టోబర్ 30 తేదీన వివాహం చేసుకొన్నారు. ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలోనే కాజల్ అగర్వాల్ గర్భం దాల్చినట్లు ఆమె భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీని కారణంగా కాజల్ కొన్ని సినిమాల నుంచి తప్పుకున్నారు.
The last few days have been surreal. Ever since our baby girl arrived.. ??❤️ pic.twitter.com/kKWsTU8gqW
— Pranitha Subhash (@pranitasubhash) June 10, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com