కూతురి బర్త్ డే.. ప్రగతి ఆంటీ ఏమోషనల్ పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
1990ల కాలం నుంచి నటిగా రాణిస్తున్నారు ప్రగతి.... ప్రస్తుతం అమ్మ, అక్క, వదిన, అత్త వంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తూ బిజీగా వున్నారు. అప్పట్లో కొన్ని చిత్రాల్లో ప్రగతి హీరోయిన్ గా కూడా నటించింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రగతి యాక్టీవ్‌గానే వుంటారు. 50కి దగ్గరవుతున్నా.. పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా కుర్రకారును తనవైపు తిప్పుకొంటోంది. ఇటీవలి కాలంలో డ్యాన్స్‌లు, వర్కవుట్స్‌కు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇకపోతే ప్రగతికి తన కూతురు గీత అంటే పంచ ప్రాణాలు. ఈ రోజు ఆమె పుట్టినరోజు కావడంతో.. తల్లిగా భావోద్వేగానికి గురై ఏమోషనల్ పోస్ట్ పెట్టారు.
నా నవ్వుకు కారణం నువ్వే, నా బలం నువ్వే, నా ఆశకు కారణం నువ్వే... నా అమ్ములూ" అంటూ నటి ప్రగతి పోస్ట్ చేశారు. "అమ్ములూ... హ్యాపీ బర్త్ డే. నువ్వు ప్రతి క్షణం నేను ఎంత గర్వపడేలా చేస్తావో నీకు తెలియదు. నేను నీ తల్లి కావడం దైవ నిర్ణయం కావొచ్చు. విధిరాత అయ్యుండొచ్చు. కానీ, నిన్ను నా కూతురిగా పొందడం మాత్రం నా అదృష్టం, ఆశీర్వాదం. జీవితాన్ని ఓ వేడుకలా నేను సెలబ్రేట్ చేసుకోవడానికి నువ్వే కారణం. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి" అని ప్రగతి ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగతి కుమార్తె గీతకు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments