Poonam Kaur : పడబోతుంటే రాహుల్ నా చేయి పట్టుకున్నారు... ఇంత రాద్ధాంతమా : పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారతో జోడో యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ప్రారంభమైన ఈ యాత్ర కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. ఇక్కడ నాయకులు సరిగా లేనప్పటికీ... సంస్థాగతంగా కేడర్ బలంగానే వుంది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో రాహుల్ గాంధీ పాదయాత్ర వల్ల పార్టీకి జోష్ వస్తుందని అంతా భావిస్తున్నారు. అటు యువనేత సైతం ప్రజలతో నేరుగా మమేకమవుతూ... సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే రాహుల్ పాదయాత్రలో సినీనటి పూనమ్ కౌర్ కలిసి నడిచారు.
రాహుల్ చేతిలో చెయ్యేసి నడిచిన పూనమ్:
అయితే ఈమె సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే పూనమ్ కౌర్.... ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టడం, తర్వాత తొలగించడం చేస్తూ వార్తల్లో నిలుస్తూ వుంటారు పూనమ్. ఈ క్రమంలో శనివారం మహబూబ్‌నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్లోని జయప్రకాశ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్రలో ఆయన వెంట నడిచారు. ఆలిండియా చేనేత కార్మిక సంఘం సభ్యులతో కలిసి.. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. చేనేత పైన కేంద్రం వేసిన 5 శాతం జీఎస్టీ ఎత్తివేయాలని... ముడిసరుకులపైనా పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రాహుల్‌కి పూనమ్ కౌర్ వివరించారు.
మోడీ నారీశక్తిపై ఏమన్నారో గుర్తులేదా :
ఇదిలావుండగా.. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ చేతిలో చేయ్యేసి పూనమ్ కౌర్ నడిచారు. అంతే దీనిపై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ మొదలెట్టారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీజేపీ నేత ప్రీతి గాంధీ కూడా నెటిజన్లతో జత కలిశారు. రాహుల్ గాంధీ తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆమె సెటైర్లు వేశారు. దీనికి పూనమ్ కౌర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇది మిమ్మల్ని మీరే కించపరచుకున్నట్లుగా వుంది.. మోడీ సైతం నారీశక్తి గురించి మాట్లాడారన్న సంగతిని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. తాను బ్యాలెన్స్ తప్పి కిందపడుతుండగా రాహుల్ తన చెయ్యి పట్టుకున్నారని పూనమ్ తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com