ముంబైలో పూజా హెగ్డే కొత్త ఇల్లు.. పనుల్ని దగ్గరుండి చూసుకుంటోన్న బుట్టబొమ్మ.. !!
Send us your feedback to audioarticles@vaarta.com
సామాన్యులైనా, సెలబ్రెటీలైనా సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది కల. ఎవరీ స్తోమతకు తగ్గట్టు వారు డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకుంటారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. ప్రస్తుత సౌత్ టూ నార్త్ బిజీ హీరోయిన్‌గా మారిన పూజా హెగ్డే కూడా తన సొంతింటి కలను నెరవేర్చుకుంటోంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఆమె ఇటీవల ఓ ఇల్లు కొన్నారు. ఆ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా డిజైన్ చేయించుకుంటున్నారు పూజ. షూటింగ్‌లతో బిజీగా వున్నప్పటికీ ఇంటీరియర్ డిజైన్, కలర్ వంటి విషయాలను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘‘నా కలలను నిర్మించుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
ఇక పూజా హెగ్డే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. దీపావళికి రాధేశ్యామ్‌లో పూజా హెగ్డే పాత్రకు సంబంధించిన టీజర్ లాంటిది రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఆచార్య నుంచి దీపావళికి పూజా హెగ్డే మీద ఏదైనా స్పెషల్ పోస్టర్ వస్తుందేమో చూడాలి. మరోవైపు టాలీవుడ్‌లో పూజా హెగ్డేకు గట్టిగానే రెమ్యూనరేషన్ ఇచ్చుకుంటున్నారని తెలుస్తోంది. రెండు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు పూజా హెగ్డేకు ముడుతోందని టాక్. ఇక ఈ రేంజ్‌లో సంపాదిస్తోంది కనుకే బుట్టబొమ్మ అదిరిపోయే ఇళ్లు కడుతోందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com