పాయల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు వారి మాట్లాడే మాటలను బట్టి శిక్ష కూడా దాదాపుగా ఖరారు చేస్తున్నారు. ఒకప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు వదిలేసేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది.. అసభ్యంగా మాట్లాడితే తాటతీయడమే. ఇలా ఇష్టానుసారం నోటికొచ్చినన్ని మాటలు మాట్లాడిన సుప్రసిద్ధ మోడల్, బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గీ కటకటాలపాలైంది. సోమవారం నాడు రాజస్థాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అసలేం జరిగింది!?
జవహర్ లాల్ నెహ్రూపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా పాయల్ రోహాత్గీ అభ్యంతర వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగని ఆమె.. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కుటుంబాన్ని.. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ అర్ధాంగిపై రోహాత్గీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రాజస్థాన్ యువజన కాంగ్రెస్ నేత చర్మేశ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐటీ చట్టం ప్రకారం పాయల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పాయల్ మాట్లాడింది. ‘గూగుల్‌లో ఉన్న సమాచారంతోనే నేను ఈ వ్యాఖ్యలు చేశాను. భావవ్యక్తీకరణ హక్కు ఓ జోక్‌గా మారిపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments