పాయల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

  • IndiaGlitz, [Monday,December 16 2019]

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు వారి మాట్లాడే మాటలను బట్టి శిక్ష కూడా దాదాపుగా ఖరారు చేస్తున్నారు. ఒకప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు వదిలేసేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది.. అసభ్యంగా మాట్లాడితే తాటతీయడమే. ఇలా ఇష్టానుసారం నోటికొచ్చినన్ని మాటలు మాట్లాడిన సుప్రసిద్ధ మోడల్, బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గీ కటకటాలపాలైంది. సోమవారం నాడు రాజస్థాన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

అసలేం జరిగింది!?

జవహర్ లాల్ నెహ్రూపైనా, ఆయన కుటుంబసభ్యులపైనా పాయల్ రోహాత్గీ అభ్యంతర వ్యాఖ్యలు చేసింది. అంతటితో ఆగని ఆమె.. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కుటుంబాన్ని.. ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ అర్ధాంగిపై రోహాత్గీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రాజస్థాన్ యువజన కాంగ్రెస్ నేత చర్మేశ్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐటీ చట్టం ప్రకారం పాయల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పాయల్ మాట్లాడింది. ‘గూగుల్‌లో ఉన్న సమాచారంతోనే నేను ఈ వ్యాఖ్యలు చేశాను. భావవ్యక్తీకరణ హక్కు ఓ జోక్‌గా మారిపోయింది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

More News

సీఎం నిర్ణయం చారిత్రాత్మకం.. జగన్‌కు జై..: రాపాక

జనసేన వన్ అండ్ ఓన్లీ రాపాక వరప్రసాద్ మరోసారి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అసెంబ్లీ వేదికగా జై కొట్టారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు.

అసెంబ్లీ టుడే: జగన్ మాటలకు చంద్రబాబు సైలెంట్..!

దళితుల విషయంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రదర్శిస్తున్న కపట ప్రేమను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు.

ప్లీజ్ నన్ను క్షమించండి..: డైరెక్టర్ భాగ్యరాజ్

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ ఆడవారిపై ఇటీవల నోటికొచ్చినట్లు మాట్లాడి హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అత్యాచారాలు జరగటానికి కారణం ఆడవారేనని.. మహిళలు పద్దతీ పాడు లేకుండా ఉంటున్నారనీ

బాలయ్యతో సినిమాపై తేల్చేసిన సోనాక్షి సిన్హా...

నంద‌మూరి బాల‌కృష్ణ- బోయపాటి కాంబోలో సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకు ఇది 106వ సినిమా కావడంతో కాసింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

'మీ టూ' వ్య‌వ‌హారంపై తేజ‌స్వి వెబ్‌సిరీస్‌

ప్ర‌పంచం యావ‌త్తు మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడుద‌ల‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో ప్రారంభ‌మైన ఉద్య‌మం `మీ టూ`. హాలీవుడ్ నుండి ప్రారంభ‌మైన ఈ ఉద్య‌మంతో సినిమా రంగం స‌హా ప‌లు రంగాల్లోని