Pavithra Lokesh - Naresh : మమ్మల్ని అల్లరి చేస్తున్నారు.. ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్‌కు పవిత్రా లోకేష్ ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనతో రిలేషన్‌లో వున్న నరేష్‌పైనా, తనపైనా కొన్ని వెబ్‌సైట్లు, ఛానెళ్స్ ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని పవిత్రా లోకేష్ తెలిపారు. దీనిపై స్పందించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఫిర్యాదు స్వీకరించామని .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను కుదిపేసిన పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్:
కాగా... పవిత్రా లోకేష్- నరేష్‌ల రిలేషన్‌షిప్ వ్యవహారం టాలీవుడ్ , శాండిల్‌వుడ్‌లను ఈ ఏడాది ఓ కుదుపు కుదిపింది. నరేష్, పవిత్రా లోకేష్‌ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరిలో ఎవ్వరూ ఖండించలేదు. కానీ చివరికి అవే నిజమయ్యాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా, కలిసేవుంటున్నారు. ఇదే సమయంలో నరేష్ మూడో భార్య రమ్య రఘపతి వీరిద్దరిని మైసూరులోని ఓ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా, చెప్పుతో కొట్టేందుకు సిద్ధమైంది.
సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియల నాడు పక్కపక్కనే:
నరేష్, పవిత్రలు తమకు వయసుకు తగ్గట్టుగా హీరో హీరోయిన్లకు తల్లిదండ్రులుగా, అత్తామామలుగా నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం.. రిలేషన్‌షిప్ వరకు వెళ్లిందని ఫిలింనగర్ జనాలు చెబుతూ వుంటారు. ఇక తమ వ్యవహారం అందరికీ తెలిసిపోవడంతో ఇద్దరూ నిర్భయంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల మరణించిన టాలీవుడ్ దిగ్గజం, సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాల సమయంలోనూ వీరిద్దరూ పక్కపక్కనే వున్నారు. ఈ ఘటనకు ముందు నరేష్ - పవిత్రా లోకేష్‌లను వెబ్‌సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా జనాలు అంతగా పట్టించుకోలేదు. కానీ కృష్ణ మరణానంతరం విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇది శృతి మించడంతోనే పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments