ఓ వ్యక్తిని నమ్మి మోసపోయిన నిక్కీ గల్రానీ
Send us your feedback to audioarticles@vaarta.com
బిజినెస్ ఏదైనా సరే.. కలిసొచ్చిందా.. వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు. కలిసి రాలేదా.. అంతా కొలాప్స్. అయితే పార్ట్‌నర్‌షిప్ బిజినెస్ ఏదైనా ఎప్పటికైనా ఇబ్బందులకే దారి తీస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీలంతా కాస్త సంపాదించగానే దానిని బిజినెస్‌లో పెట్టి రెట్టింపు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అలాగే కోలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీ కూడా బిజినెస్‌పై దృష్టి సారించింది. ఓ హోటల్ బిజినెస్‌లోకి దిగింది. అయితే ఆమె స్వయంగా ఏ హోటల్‌ని పెట్టలేదు. ఓ హోటల్ యజమానిని నమ్మి బిజినెస్ పార్ట్‌నర్‌గా చేరి మోసపోయింది. ఈ విషయాన్ని ఆ ముద్దుగుమ్మ స్వయంగా వెల్లడింది.
‘డార్లింగ్’, ‘కలకలప్పు-2’ వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నిక్కీ... సినిమాలపై వచ్చిన డబ్బుతో బిజినెస్ చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా బెంగుళూరులోని కోరమంగళ అనే ప్రాంతంతో నిఖిల్ అనే వ్యక్తితో కలిసి తాను రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టి హోటల్‌ని ప్రారంభించింది. వీరి మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం నిఖిల్ నెలకు ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ హోటల్‌ను ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకూ నిఖిల్ తనకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని నిక్కీ వాపోయింది.
ఒప్పందం ప్రకారం డబ్బు ఇవ్వకపోగా తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బును సైతం తిరిగి ఇవ్వలేదని నిక్కి చెబుతోంది. ఈ మేరకు తనను మోసం చేసిన హోటల్ యజమాని నిఖిల్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం నెలకు ఇవ్వాల్సిన లక్ష రూపాయలను ఇప్పటి వరకూ ఏ నెలా ఇవ్వలేదని.. పైగా తాను పెట్టిన డబ్బును సైతం ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోటల్ యజమాని నిఖిల్‌ని పిలిచి విచారణ నిర్వహిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments