Nagma:అన్ని తెలిసి కూడా కేటుగాళ్ల చేతిలో బుక్కయిన నగ్మా.. ఎంత దోచేశారో తెలుసా..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఆధునిక కాలంలో టెక్నాలజీ వినియోగం ఎంత పెరిగిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు సాంకేతికతతోనే పని. అయితే కత్తికి రెండు వైపులా పదును వున్నట్లు టెక్నాలజీతో నేరాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరిని కేటుగాళ్లు వదలడం లేదు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు సీనియర్ హీరోయిన్ నగ్మా. ఏకంగా లక్ష రూపాయలను ఆమె నుంచి దోచేశారు .
బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని మాయమాటలు:
వివరాల్లోకి వెళితే.. గత నెల 28న నగ్మా మొబైల్‌కి బ్యాంక్ వాళ్లు పంపినట్లు ఒక మెసేజ్ పంపారు కేటుగాళ్లు. అనంతరం దానిని నగ్మా క్లిక్ చేయగా.. ఆమెకు వెంటనే బ్యాంక్ సిబ్బందిమంటూ ఫోన్ చేశారు. తనకు కొన్ని వివరాలు కావాలని, కేవైసీ అప్డేట్ చేయాల్సి వుందని నగ్మాకు మాయ మాటలు చెప్పారు. దీనిని నిజమేనని నమ్మారు నగ్మా. ఈ క్రమంలో ఆమె ఖాతాలోకి వెళ్లిపోయి.. దాని నుంచి తన ఖాతాకు లక్షరూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారట కేటుగాళ్లు. నగదు బదిలీ చేసుకునే క్రమంలో తనకు మల్టీపుల్ ఓటీపీలు వచ్చాయని.. అయితే పెద్ద మొత్తంలో కాకుండా కేవలం లక్ష రూపాయలతో బయటపడినందుకు నగ్మా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని.. అనుమానాస్పదంగా వున్న లింక్స్‌పై క్లిక్ చేయొద్దని నగ్మా ప్రజలకు సూచించారు.
దేశాన్ని ఒక ఊపు ఊపిన నగ్మా:
ఇదిలావుండగా..90వ దశకంలో యావత్ దేశాన్ని తన అందం, అభినయంతో ఒక ఊపు ఊపారు నగ్మా. అరేబియన్ గుర్రం లాంటి ఫిగర్‌తో, వైట్ స్కిన్ టోన్‌తో కుర్రాళ్ల కలల రాణిగా వెలుగొందారు. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా దక్షిణాదిలోని అందరూ సూపర్స్టార్స్తోనే నగ్మా ఆడిపాడారు. సినిమాల తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నగ్మా.. కాంగ్రెస్‌లో చేరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout