Nabha Natesh:ప్రమాదం బారినపడ్డ ఇస్మార్ట్ బ్యూటీ.. సర్జరీతో ప్రాణాలతో బయటపడి, నభా నటేష్ ఎమోషనల్ పోస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
2022లో చాలా మంది హీరోయిన్లకు అస్సలు కలిసిరాలేదని చెప్పుకోవచ్చు. సమంత, పూనంకౌర్ వంటి హీరోయిన్లు వ్యాధుల బారినపడగా.. మరికొందరికి ఒక్క హీట్ కూడా పడకపోవడంతో నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలో కన్నడ కస్తూరి నభాన నటేష్ సంచలన పోస్ట్ చేశారు. 2021లో నితిన్ హీరోగా వచ్చిన మ్యాస్ట్రో తర్వాత మరే చిత్రంలోనూ ఆమె కనిపించలేదు. దీనిపై రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఇండస్ట్రీ నుంచి కానీ , నభా నుంచి కానీ ఎలాంటి స్పందనాలేదు. ఈ క్రమంలో నభా నటేష్ ఇవాళ ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ప్రమాదం బారినపడి .. సినిమాలకు దూరమయ్యా :
గడిచిన ఏడాది తనకు చాలా కష్టంగా సాగిపోయింది.. ఓ ప్రమాదంలో తన ఎడమ భుజానికి తీవ్రగాయమై క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. చికిత్స సమయంలో తాను తీవ్రమైన శారీరక, మానసిక బాధను ఎదుర్కొన్నా.. నాకు ఎంతో ఇష్టమైన సినిమాకి దూరం కావాల్సి వచ్చింది. శారీరక దృఢత్వాన్ని పొంది.. తిరిగి సినిమాల షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా వున్నట్లు చెప్పారు. సినిమాలతో 2023లో మళ్లీ సత్తా చాటుతానని నభా తన పోస్ట్‌లో తెలియజేశారు. దీంతో ఆమె తిరిగి కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ :
ఇకపోతే.. 1995 డిసెంబర్ 11న కర్ణాటకలో జన్మించిన నభా నటేష్ శృంగేరిలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉడుపిలోని ఎన్హెచ్ఏఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో డిగ్రీ చదివారు.జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ దర్శకుడు ప్రకాష్ బెలగాడి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. 2013లో బెంగళూరులో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగళూరులో టాప్ 11లో నిలిచారు. అనంతరం 2015లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన వజ్రకాయతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిక్ హీరో రామ్ నటించిన ‘‘ఇస్మార్ట్ శంకర్’’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు.
I am here because of all your love. 🙏
— Nabha Natesh (@NabhaNatesh) January 10, 2023
It was not easy taking a back seat from work, from all of you…
I am back now! Thank you all for all the support you guys have given me ❤️❤️ pic.twitter.com/Mq6yk3qCjK
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments