గ్యారంటీలేని బతుకులు.. అయినా ఓర్చుకుంటాం: ‘సినీ’ జీవితాలపై మెహ్రీన్ ఎమోషనల్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
రెండున్నర గంటల పాటు ప్రజలకు వినోదం పంచేందుకు సినీ తారలు ఎంతో శ్రమిస్తారు. ఒక సినిమా తయారవ్వడం వెనుక వందలాది మంది కృషి వుంటుంది. ఈ క్రమంలో ఎందరో తారలు షూటింగ్ సమయంలో గాయపడిన, మరణించిన ఉదంతాలు వున్నాయి. సినిమా కోసం గంటల తరబడి కసరత్తులు చేస్తూ గుండె ఆగిపోయిన హీరోలు కూడా ఎందరో. అయినప్పటికీ బాధను పంటి బిగువున భరిస్తూనే కష్టపడతారు. ఎందుకంటే వాళ్లకి సినిమానే శ్వాస కాబట్టి.
ఈ నేపథ్యంలో సినీ కళాకారుల జీవితాలపై ఎమోషనల్ కామెంట్ చేశారు హరోయిన్ మెహ్రీన్ కౌర్. ఎలాంటి గ్యారంటీలేని బతుకులని .. అయినప్పటికీ అలాంటి అస్థిర జీవితాలను తాము ఇష్టపూర్వకంగానే ఎంచుకుంటామని వ్యాఖ్యానించింది. సినిమా కోసం తమ శరీరాలను అనుకూలంగా మలచుకుంటామని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తుంటామని, కొన్ని సార్లు అధ:పాతాళానికీ వెళ్లిపోతుంటామని మెహ్రీన్ తెలిపింది.
ఒక్కోసారి రాత్రికి రాత్రే ఘనమైన విజయాలు సాధిస్తుంటామని, మరికొన్ని సార్లు వైఫల్యాలను చూస్తామని వెల్లడించింది. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా కెరీర్ కోసం తాము అన్నిటికీ అలవాటు పడ్డామని మెహ్రీన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆకలి, నిద్ర, బాధ అన్నింటికీ ఓర్చుకుని పనిచేస్తామని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com