మమతా మోహన్‌దాస్ బోల్డ్ ఫోటోషూట్.. నెటిజన్లు ఫిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఫొటోషూట్లు చేసే కొద్దిమంది నటీమణులలో మోలీవుడ్ ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్ ఒకరు. బ్లూ మూన్ వెలుగులో ఒక గుర్రంపై కూర్చొని ఈ ముద్దుగుమ్మ ఫోటోకి ఫోజుచ్చి అభిమానులకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక మ్యాగజైన్ కోసం మమత ఈ బోల్డ్ ఫోటో షూట్లో పాల్గొంది. ఆ అద్భుతమైన ఫోటోషూట్ నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు అమ్మడి అందాలకు ఫిదా అవుతున్నారు.
‘యమదొంగ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి మమతా మోహన్‌దాస్. మాలీవుడ్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ.. మలయాళంతో మమతా మోహన్‌దాస్ నటి మాత్రమే కాదు... అద్భుతమైన సింగర్ కూడా. ప్రధానంగా మలయాళ చిత్రాలలోను, కొన్ని తమిళ, తెలుగు సినిమాలలోనూ నటించింది. మమతను దర్శకుడు రాజమౌళి తెలుగు తెరకు యమదొంగ చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఆ తరువాత ‘కృష్ణార్జున’, ‘హోమం’ వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ఆమె రెండు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, 2006లో తెలుగులో ఉత్తమ నేపథ్య గాయని పురస్కారాన్ని సైతం అందుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments