చీప్ యాక్టర్‌‌తో పోల్చొద్దంటూ పోస్ట్.. స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

  • IndiaGlitz, [Tuesday,February 01 2022]

సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజన్లకు టార్గెట్‌గా మారుతున్నారు సెలబ్రిటీలు. చిన్న పోస్ట్ చేయడం పాపం.. అయినదానికి కానిదానికి వాళ్లను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ప్రముఖులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా నెటిజన్ల ట్రోలింగ్‌తో చిర్రెత్తుకొచ్చుకొచ్చిన సినీనటి లావణ్య త్రిపాఠి గట్టి కౌంటరిచ్చారు.

అసలేం జరిగిందంటే.. ఇటీవల త‌మిళ‌నాడులో క్రైస్త‌వ మ‌తం స్వీక‌రించ‌నందుకు కొంద‌రు లావ‌ణ్య అనే మైన‌ర్ బాలిక‌ను వేధింపుల‌కు గురి చేయగా ఆ బాలిక ఆత్మ‌హ‌త్యకు పాల్పడింది. దీంతో మ‌త మార్పిళ్ల‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ... చనిపోయిన మైన‌ర్ బాలిక‌కు న్యాయం జ‌ర‌గాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో లావ‌ణ్య పేరుతో పాటు లావణ్య త్రిపాఠిని కూడా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.

దీనికి ఓ నెటిజ‌న్ రియాక్ట్ అవుతూ.. లావణ్య త్రిపాఠి హ్యాష్‌ట్యాగ్‌ని వాడొద్దని సూచించారు. ఆమె నటి.. చ‌నిపోయిన లావణ్య తమిళనాడుకి చెందిన ఒక సాధారణ అమ్మాయి. ఆ మైన‌ర్ బాలిక ధ‌ర్మం కోసం చ‌నిపోతే, ఆమెను చీప్ న‌టితో ఎందుకు పోలుస్తున్నారంటూ పోస్ట్ చేశాడు. దీనికి లావణ్య త్రిపాఠి ఘాటుగా బదులిచ్చింది. ఏదైనా చెడు సంఘటన జరిగినప్పుడు మాత్రమే నీలాంటి వాళ్లు మహిళలను గౌరవిస్తారంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతకు ముందు నీలాంటి వాళ్లే మహిళలను చీప్ అంటారని.. అంద‌రిని గౌర‌వించ‌డం నేర్చుకోవాలని లావణ్య త్రిపాఠి హితవు పలికారు. స‌మాజంలో వాస్త‌వ ప‌రిస్థితి ఇదేనంటూ ఆమె స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు.

More News

క్రిప్టో కరెన్సీకి కళ్లెం.. ఇండియాలో అందుబాటులోకి డిజిటల్ రూపీ

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పెట్టుబడులు పెట్టేవారు కూడా రోజురోజుకు విస్తరిస్తున్నారు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి కూడా వచ్చింది.

వేతన జీవులకు నిరాశ... ట్యాక్స్ స్లాబులపై నోరు విప్పని నిర్మలా సీతారామన్

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పేయర్స్‌కు నిర్మలమ్మ నిరాశనే మిగిల్చారు.

ఆర్మీకి 117 ఎకరాల భూమి విరాళం.. అది అవాస్తవం, నేనేమి ఇవ్వలేదు : పుకార్లకు సుమన్ చెక్

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు మన చుట్టూ చాలా మంది వున్నారు. ఇక సోషల్ మీడియా రాకతో ఈ పిచ్చి మరింత ముదిరింది.

‘‘భీమ్లా నాయక్’’ ఆ రెండింటిలో ఏ రోజునో మరి..?

రానున్న మూడు నెలల్లో సినిమా పండగని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు చెప్పినట్లుగానే టాలీవుడ్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

ఆర్ఆర్ఆర్ విడుదలపై క్లారిటీ.. వెనక్కి జరిగిన ‘‘ఆచార్య’’ , రిలీజ్ ఎప్పుడంటే..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ను మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు