Kushboo:నా తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. అమ్మకు చెబుదామంటే : ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Monday,March 06 2023]
ఖుష్బూ.. ఈ పేరు తెలియనివారు దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేరు. హీరోయిన్లను ప్రేక్షకులు అమితంగా ఆరాధించడం, ఇంటి నిండా వారి పోస్టర్లను అంటించుకోవడం బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి వున్నదే. కానీ ఖుష్భూ రాకతో నటీమణులకు ఆలయాలు కట్టిన చరిత్ర మొదలైంది. ఆమెను తన ఇంట్లో మనిషిగా ఓన్ చేసుకున్న తమిళ తంబీలు గుడి కట్టేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. ఇక తమిళ సీనియర్ నటుడు ప్రభుతో ప్రేమాయణం సాగించిన ఆమె ఆయనను పెళ్లాడారు. అయితే దీనికి ప్రభు తండ్రి శివాజీ గణేషన్ అభ్యంతరం తెలపడంతో ఈ జంట వీడిపోయింది. అనంతరం దర్శకుడు సుందర్ సీ ని ఖుష్బూ పెళ్లాడారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఖుష్భూ కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
మూడు పార్టీలు మారిన ఖుష్భూ:
సినిమాల్లో కొనసాగుతూనే ఖుష్బూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2010లో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో డీఎంకేలో చేరారు. ఆ తర్వాత 2014లో డీఎంకేను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కొనసాగిన ఆమె.. అక్కడా ఇమడలేకపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన, విధానాలకు ఆకర్షితులైన బీజేపీలో చేరారు. అయితే ఆమె సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచేవారు. సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో వున్నప్పటికీ.. తనకు ఎలాంటి పదవీ దక్కడం లేదనే ఆవేదన ఖుష్బూలో వుంది.
మా అమ్మకు భర్తే దైవం:
ఇదిలావుండగా.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బాల్యంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖుష్బూ మాట్లాడుతూ.. చిన్న తనంలో పిల్లలు వేధింపులకు గురైతే, వారిని జీవితాంతం అది వెంటాడుతూనే వుంటుందన్నారు. భార్యాపిల్లల్ని చిత్రహింసలకు గురిచేయడం, కన్నకూతురిపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి వల్ల తన తల్లి ఎన్నో ఇబ్బందులు పడిందని ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని చెప్పినా తన తల్లి వినే పరిస్ధితుల్లో లేదేని.. ఎందుకంటే ఆయనకు తన భర్తే దైవమని ఖుష్బూ చెప్పారు. తన తండ్రి వేధింపులు భరించలేక.. 15 ఏళ్లప్పుడు ఆయనకు ఎదురు తిరిగానని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.
And here we have the learnt n abled heads who are more worried about what my children would think. I am a proud mother who have supportive daughters. I speak bcoz they gave me the courage. And thoda meri history pad lo janaab. Sharmindhgi se bach jaaoge. Ghatiya soch full on hai. https://t.co/uFo8ItiY0q
— KhushbuSundar (@khushsundar) March 6, 2023