krithi shetty: ఇంటర్వ్యూలో అరిచిన యాంకర్.. లైవ్‌లోనే ఏడ్చేసిన కృతిశెట్టి, నెటిజన్ల ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
సరదాగా ఇతరులను భయపెట్టేందుకో, ఏడిపించేందుకో చేసే ఫ్రాంక్ వీడియోలు ఇటీవలి కాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీటి వల్ల ఎదుటి వారిని నవ్వించడం ఏమో కానీ, అవి చేసే వారు మాత్రం నవ్వుల పాలవుతున్నారు. దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు. దీనికి బాధితులు కూడా ఎంతో మంది వున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరారు యంగ్ బ్యూటీ కృతి శెట్టి.
వివరాల్లోకి వెళితే.. తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తున్న కృతిశెట్టి.. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కృతితో ఇంటర్వ్యూలు తీసుకునేందుకు పలు ఛానెల్స్, మ్యాగజైన్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కృతిశెట్టికి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు యాంకర్స్ చేసిన పనికి ఆమె లైవ్‌లోనే కంటతడి పెట్టింది.
అన్ని నువ్వే అడిగితే నేనేందుకు :
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు కృతిశెట్టి. అనంతరం ఆమె ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఇద్దరు యాంకర్స్ పాల్గొనగా.. ఒకరు మాత్రమే కృతిని ఇంటర్వ్యూ చేయగా మరొకరు మాత్రం సైలెంట్‌గా వుండిపోయారు. ఇంతలో ఖాళీగా వున్న యాంకర్ లేచి ప్రశ్నలన్నీ నువ్వే అడిగేస్తే.. నన్ను ఎందుకు పిలిచినట్లు, ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవరు అంటూ కేకలు వేశాడు. దీనికి మరో యాంకర్ కూడా ధీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవకు కృతిశెట్టి ఖంగుతింది.
ఇది ఫ్రాంక్ మేడమ్.. ప్లీజ్ ఏడవొద్దు:
ఆపై యాంకర్లిద్దరూ కృతిశెట్టి దగ్గరకు వెళ్లి.. ఇది కేవలం ఫ్రాంక్ మాత్రమేనని , కంగారు పడొద్దని చెప్పారు. అంతే .. కృతిశెట్టి స్టేజ్ మీదే కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో కంగారుపడ్డ యూనిట్ సభ్యులు ఆమెను పక్కకు తీసుకెళ్లి ఓదార్చారు. అనంతరం తేరుకున్న కృతిశెట్టి.. ఎవరైనా గట్టిగా మాట్లాడితే తనకు భయమని వాపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు యాంకర్స్‌పై మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com