Actress Kavitha:మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు సిగ్గుచేటు.. మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా? అని నటి కవిత ఆగ్రహం
Send us your feedback to audioarticles@vaarta.com
మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సినీ నటి కవిత తీవ్రంగా ఖండించారు. అన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి స్థాపించిన పార్టీలోని నాయకులు మహిళల గురించి ఇంత నీచంగా మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. కానీ టీడీపీ నేతలు ఇంత నీచంగా దిజగారి మాట్లాడతారని తాను అసలు ఊహించలేదన్నారు.
బండారు వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలని డిమాండ్..
సినీ నటుడు అయిన ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోని నాయకులు సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలపై ఇలా మాట్లాడటం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు విన్న మహిళలు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించారు. బండారు వ్యాఖ్యలను నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలని కవిత డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ కడుపున పుట్టిన భువనేశ్వరి.. మహిళలపై టీడీపీ నేతలు అత్యంత అసభ్యకరంగా మాట్లాడితే కనీసం ఖండించరా? అని నిలదీశారు.
బండారు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్..
రోజాపై బండారు సత్యనారాయణ చేసిన దారుణ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఓ మహిళా మంత్రి పట్ల ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా అని మహిళ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బండారుపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. దీంతో బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు నగరపాలెం స్టేషన్‌కు తరలించారు.
కన్నీళ్లు పెట్టుకున్న రోజా.. మీ ఇంట్లో మహిళలకు ఇలాగే జరిగితే సమర్థిస్తారా? అని ఆవేదన
బండారు సత్యనారాయణ తనపై చేసిన వ్యాఖ్యలను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. టీడీపీ నేతలు బండారు వ్యాఖ్యలను సమర్థించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్‌తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్యనారాయణ అరెస్టును ఖండించడంపై రోజా వాపోయారు. వారి తల్లులు, భార్యలు, కుమార్తెలకు ఇలాగే జరిగితే సమర్థిస్తారా అని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి తనను వేధిస్తున్నారని తెలిపారు. బ్లూ ఫిల్మ్స్‌లో నటించారని పదే పదే టార్చర్ చేశారన్నారు. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారని.. కానీ నిరూపించలేదని రోజా వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments