తీవ్ర విషాదం.. నటి కవిత భర్త మృతి, కొడుకు మరణించిన 15 రోజుల్లోనే..

  • IndiaGlitz, [Wednesday,June 30 2021]

ఒక ప్రళయంలా వచ్చి ప్రజలపై పడ్డ కరోనా వైరస్ వేలాది కుటుంబాల్లో చీకటి నింపుతోంది. ప్రజల ప్రాణాలు బలిగొంటున్న కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇది ఎప్పుడు అంతం అవుతుందో అర్థం కానీ పరిస్థితి. సీనియర్ నటి కవిత అందరికి సుపరిచయమే.

దక్షణాది భాషలో కవిత వందలాది చిత్రాల్లో నటించారు. కరోనా వైరస్ ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జీర్ణించుకోలేని శోకాన్ని మిగిల్చింది. జూన్ 15న కోవిడ్ వల్ల కవిత కుమారుడు సంజయ్ రూప్ మరణించాడు. ఈ సంఘటన జరిగి 15 రోజులు గడవక ముందే నేడు కవిత తన భర్తని కూడా కోల్పోయారు.

కోవిడ్ తో కవిత భర్త దశరథ రాజ్ ఆరోగ్యం క్షీణించింది. దీనితో ఆయన చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. కవిత కుటుంబంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఊహకు అందని విషాదమే అని చెప్పాలి.

కవిత కొడుకు సంజయ్ రూప్, భర్త దశరథ్ ఇద్దరూ కొన్ని రోజుల క్రితం కోవిడ్ బారీన పడ్డారు. 11 ఏళ్ల వయసులోనే కవిత నటిగా మారింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో పాటు ఈ తరం హీరోల చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

More News

జల్సాలో పవన్.. RRR లో ఎన్టీఆర్.. దీని వెనుక ఇంత కథ ఉందా..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదల కోసం అభిమానులంతా ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అమేజింగ్.. బికినీలో రకుల్ అందాల ట్రీట్!

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ లో కూడా రకుల్ స్టార్ హీరోయిన్.

'సాహో' నటి భర్త హఠాన్మరణం.. కారణం ఇదే!

ప్రముఖ బాలీవుడ్ నటి, టెలివిజన్ పర్సన్ అయిన మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ మృతి చెందారు.

అవికా గోర్ రొమాంటిక్ మూవీ టైటిల్ ఇదిగో!

యంగ్ బ్యూటీ అవికా గోర్ నేడు తన 24వ పుట్టినరోజు జరుపుకుంటోంది.

విజయ్ 'బీస్ట్'లో స్టార్ హీరో కామియో.. ఎవరో తెలుసా..

ఇలయదళపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'బీస్ట్' అనే చిత్రంలో నటిస్తున్నాడు.